రాజ్య‌స‌భ‌లో కొత్త ఎంపీలు.. బిసిల‌కు న్యాయం జ‌రిగిన‌ట్లే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్లో ప‌ద‌వుల పండుగ ప్రారంభ‌మైంది. ఏపికి చెందిన ముగ్గురు వైసీపీ ఎంపీలు రాజ్య‌స‌భ స‌బ్యులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. దీంతో వైసీపీకి ఎంపీల బ‌లం రాజ్య‌స‌భ‌లో ఆరుకి చేరింది. అలాగే మ‌ద్యాహ్నం రాష్ట్రంలో ఇద్ద‌రు కొత్త మంత్రులు ప్ర‌మాణం చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

ఏపికి చెందిన పిల్లి సుభాస్ చంద్ర‌బోస్‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, అయోద్య రామిరెడ్డిలు నేడు రాజ్య‌స‌భ స‌భ్యులుగా ప్ర‌మాణం చేశారు. ముందుగా అయోద్య రామిరెడ్డి హిందీలో ప్ర‌మాణం చేశారు. త‌ర్వాత బోస్‌, మోపిదేవిలు తెలుగులో ప్ర‌మాణం చేశారు. వీరితో పాటు ప్ర‌మాణం చేయాల్సిన ప‌రిమ‌ల్ న‌త్వానీ ఆరోగ్య కార‌ణాల రిత్యా ప్ర‌మాణం చేయ‌లేదు.

అంత‌కుముందు వీరు మాట్లాడుతూ బిసిల‌కు త‌గిన గుర్తింపు ల‌భించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. సీఎం జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. త‌మ‌కు ఊహించ‌ని విధంగా ఈ ప‌ద‌వులు ద‌క్క‌డం జ‌రిగింద‌న్నారు. త‌మ‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటామ‌ని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here