ఏ.పిలో ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ విష‌యంలో కీల‌క ప‌రిణామం‌.

ఏ.పి రాజ్‌భ‌వ‌న్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఊహించ‌ని ప‌రిణామం ఎదురైన‌ట్లైంది. రాష్ట్ర ఎన్నిక‌ల కమీష‌న‌ర్ విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్‌ హ‌రిచంద‌న్ ర‌మేష్ కుమార్ కొన‌సాగాల‌ని పేర్కొనడ‌మే ఇందుకు కార‌ణం.

త‌న‌ను ఎన్నిక‌ల కమీష‌న‌ర్‌గా కొన‌సాగించేలా ఆదేశాలివ్వాల‌ని నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హైకోర్టు తీర్పు ప్ర‌కారం ఎస్ఈసీగా నిమ్మ‌గ‌డ్డ‌ను నియ‌మించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి గ‌వ‌ర్న‌ర్ లేఖ పంపారు. హైకోర్టు తీర్పును అమ‌లుచేయాలన్నారు.

అయితే గ‌తంలో హైకోర్టు చెప్పిన‌ప్ప‌టికీ త‌న‌ను విధుల్లో నియ‌మించ‌లేద‌ని నిమ్మ‌గ‌డ్డ మ‌ళ్లీ హైకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్బంగా గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి త‌న‌ను ఎస్ఈసీగా నియ‌మించాల‌ని కోరాల‌ని స్వ‌యంగా హైకోర్టే నిమ్మ‌గ‌డ్డ‌కు సూచించింది. దీంతో సోమ‌వారం గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి ర‌మేష్ కుమార్ జ‌రిగిన‌ విష‌యాన్ని వివ‌రించారు. నేడు నిమ్మ‌గ‌డ్డ విష‌యంలో హైకోర్టు తీర్పును అమ‌లుచేయాల‌ని గ‌వ‌ర్న‌ర్ ప్ర‌భుత్వానికి ఆదేశించారు.

అయితే ఇప్ప‌టికే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాల‌ని కోరిన‌ప్ప‌టికీ సుప్రీం స్టే ఇవ్వ‌లేదు. మ‌రో రెండు వారాల్లో ఈ విష‌యంలో సుప్రీం తీర్పు ఇవ్వ‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here