ట్వీట్ లందు సాయిరెడ్డి ట్వీట్లు వేరయా..! అసలే ఫ్రైడే వస్తుందయా..!

అవినీతిపై ఉక్కుపాదం, అక్రమాలపై ఇనుపపాదం అంటూ… గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై జగన్ ఫైరవుతున్న సంగతి తెలిసిందే. అవినీతి – అక్రమాలకు సంబందించిన ఏ విషయంలోనూ వెనక్కి తగ్గే ఆలోచన లేదని చెబుతున్నట్లుగా ముందుకుపోతున్నారు జగన్.

ఈఎస్‌ఐ కేసులో టీడీపీ కీలక నేత అచ్చెన్నాయుడు అరెస్టైంది.. శుక్రవారం రోజే.. తాజాగా గుంటూరులో జరిగిన వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా శుక్రవారం రోజే అరెస్ట్ అయ్యారు. ఇంకా అరెస్టుల పర్వం కొనసాగుతుందని… మరికొందరు టీడీపీ నేతలు పలు కేసుల్లో అరెస్ట్ కాబోతున్నారని సమాచారం. మరి ఆ అరెస్టులు కూడా శుక్రవారం రోజే జరుగుతాయా? లేదో వేచి చూడాలి.

ఇపుడు గంట టైం వచ్చిందా ..! అనంతరం ఏసీబీ మోగించేది.. “గంటా ఇంటి గంట” అనే సంకేతాలు అందిస్తున్నారు సాయిరెడ్డి! తెలుగు రాజకీయ ట్వీట్ లందు.. సాయిరెడ్డి ట్వీట్లు వేరయా అన్నట్లుగా సాగిపోతుంటుంది ట్విట్టర్లో విజయసాయి ప్రయాణం. ఇందులో భాగంగా నిన్నమొన్నటివరకూ వరుసపెట్ట్ టీడీపీ నేతలపైనా.. తాజాగా సుజనాచౌదరిపైనా ట్వీట్ల వర్షం కురిపించిన ఆయన… తాజాగా గంటా శ్రీనివాస్ పై ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేశారు. ఆ ట్వీట్ లో కేవలం రాజకీయ ఆరోపణలే కాకుండా… పక్కా సమాచారం తన వద్ద ఉంది.. ప్రభుత్వ పరిశీలనలో ఉందనే సంకేతాలు ఇస్తూ సాగించారు!

గంటా శ్రీనివాస్ విద్యాశాఖ మంత్రిగా 12 కోట్ల రూపాయల కొనుగోళ్లలో.. ఐదు కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని చెబుతున్నారు సాయిరెడ్డి. విద్యార్థులకు సైకిళ్ల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని.. ఎస్ కె బైక్ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టినా కూడా ఆ కంపెనీ నుంచే కొనుగోలు చేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తుప్పు పట్టిన సైకిళ్లపై గంటా శీను గణగణ అంటూ సాయిరెడ్డి తనదైన సెటైర్ వేశారు! దీంతో… ఏసీబీ రంగంలోకి దిగితే “గంటా ఇంటి గంట” ఏ క్షణమైనా మోగొచ్చనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేస్తున్నాయి. మొత్తానికి శుక్రవారం వస్తుంది అంటే టీడీపీ నేతల్లో దడ పుట్టిస్తోంది అని మీడియా వరాల్గాలో సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here