వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మానవత్వం..

గుంటూరు జిల్లా నరసరావుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మానవత్వం చాటారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు యువకులకు సకాలంలో ప్రాథమిక చికిత్స అందించి 108 అంబులెన్స్‌లో వైద్యశాలకు తరలించి మంచి పని చేశారు. మంగళవారం చిలకలూరిపేట– విజయవాడ జాతీయ రహదారిపై ఇద్దరు యువకులు బెంగుళూరుకు కారులో వెళుతుండగా అదుపుతప్పి కళ్లెం టెక్స్‌టైల్స్‌కు ఎదురుగా డివైడర్‌ను ఢీ కొట్టింది.

ఈ సంఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయానికి ఆ మార్గంలో గుంటూరుకు వెళుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి సంఘటనా స్థలంలో ఆపి స్థానికుల సహాయంతో కారు నుంచి ఆ యువకులను కిందకు తీయించారు. స్వతహాగా డాక్టర్ అయిన ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆపస్మారక స్థితిలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి ప్రాథమిక చికిత్స అందించారు.

అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న అంబులెన్స్‌లో వారిద్దరిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలంలో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి స్పందించిన తీరును స్థానికులు ప్రశంసించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here