స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కీలక వ్యాఖ్యలు..?

కరోనా వైరస్ మహమ్మారి ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి పెరుగుతున్నా కొద్ది, ప్రజలలో భయాందోళన లు మరింతగా పెరిగిపోతున్నాయి. అయితే కరోనా వైరస్ సోకిన వారిని చూడటానికి, కలవడానికి కూడా కొందరు ఇష్టపడటం లేదు. అయితే కరోనా వైరస్ సోకినా కొందరు దాచి పెడుతూ పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతేకాక వారు అలా కరోనా వైరస్ ను దాచి పెట్టడం అసలుకే ప్రమాదం అని చాలామంది హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం పై తెలుగు చిత్ర పరిశ్రమ కి చెందిన దర్శకుడు కొరటాల శివ సైతం పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా వైరస్ పాజిటివ్ గా తేలిన ప్రతి ఒక్కరికీ నా అభ్యర్థన అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. అందరమూ బాధ్యతాయుతంగా వ్యవహరిద్దాం అని, కరోనా వైరస్ సోకిన ప్రతి ఒక్కరూ కూడా ఇలా వైరస్ వచ్చిన విషయాన్ని సన్నిహితులకు, ఇటీవల కలిసిన వారికి చెప్పండి అని అన్నారు. అలా తెలపడం ద్వారా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకోనేందుకు అవకాశం ఉంటుంది అని వ్యాఖ్యానించారు. మనం నాగారికంగా ఉండాల్సిన సమయం అని, కానీ కొందరు వైరస్ వచ్చిన విషయం దాస్తున్నారు అని, ఇది వైరస్ కంటే కూడా చాలా ప్రమాదకరం అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here