ఏపీలో రైతే రాజు..ఇది ఫిక్స్!

గతంలో ప్రభుత్వాలన్నీ తమది రైతునేస్తమని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక.. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా.. తమకేం తెలియనట్లుగా చూస్తుండిపోయిన సంఘటనలు కోకొళ్లలు ! రైతులను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రచారం కోసం “రైతునేస్తం”.. “రైతేరాజు”.. అంటూ పుస్తకాలను ప్రచురించేసి ప్రచారాన్ని ముమ్మరంగా చేసాయి కూడా. అది జగమెరిగిన సత్యం. అలాంటి జగంలోని రైతును రాజులా భావించి వారి బాగోగులను తమ భుజంపై ఎక్కించుకొని నడిపిస్తూ.. రైతులపాలిట వరంగా మారుతున్నారు వైఎస్ జగన్! రైతేరాజు అని ఇంతకాలం వినిపించిన “బుక్కులో మాట”లను తోసిరాజని, చేతలతో చూపిస్తున్నారు.. ఇది ఫిక్స్!

 

వివరాళ్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతున్నారు సీఎం వైఎస్ జగన్. అందులో భాగంగా రైతులే చైర్ పర్సన్ లుగా జిల్లా, మండల స్థాయి వ్యవసాయ సలహా మండళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చైర్ పర్సన్ గా నియామకమయ్యే వ్యక్తి ఆయా జిల్లా, మండలాల పరిధిలో పదిహేనేళ్లుగా వరుసగా సాగు చేస్తున్న ప్రగతి శీలమైన రైతు అయి ఉండాలని స్పష్టం చేసింది. జిల్లా స్థాయి సలహా మండళ్లకు ఆ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి గౌరవ అధ్యక్షుడిగా, కలెక్టర్ ఉపాధ్యక్షుడుగా, మంత్రులు సభ్యులుగా వ్యవహరిస్తారని వెల్లడించింది.

అంతేకాకుండా మండల స్థాయి సలహా మండళ్లకు స్థానిక ఎమ్మెల్యే గౌరవ అధ్యక్షుడుగా, ఎంపీడీవీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అలాగే.. రాష్ట్రస్థాయి సలహా మండళ్లలో వ్యవసాయ శాఖ మంత్రి అధ్యక్షుడిగా, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షుడుగా, పశు సంవర్థక, జలవనరులు, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ మంత్రులతో పాటు మొత్తం 28మందిని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. అందుకు సంబంధించి వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

ఏ ప్రభుత్వం వచ్చినా… రైతులు అనగానే… ప్రచారం కోసం ముందుగా ఓ నాగలి భుజాన వేసుకొని ఫోటోలు దిగేసి ఆ తర్వాత పుస్తకాలను రాసేసి ప్రచురించేసి రైతులకే పంచేస్తుంటుంది. అలాంటి సమయంలో వైఎస్ జగన్ “నేను విన్నాను.. నేను కన్నాను.. ఫైనల్ గా నేను ఉన్నాను” అని చెప్పి.. రైతులను రాజులుగా చేసే సంకల్పంలో భాగంగా… వ్యవసాయం అనుబంధ రంగాల కార్యకలాపాలపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో “అగ్రికల్చర్‌ అడ్వైజరీ బోర్డు”లను ఏర్పాటు చేయడం పట్ల రైతులకు చేరువలోకి ప్రభుత్వాన్ని తీసుకెళ్తున్నారు వైఎస్ జగన్. తస్సదియ్యా… అది జగన్ పాలన అంటే అంటూ ఈ సందర్భంగా రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం విశేషం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here