కోవిడ్ 19కు స‌రైనా టీకా.. ఇది అన్ని వ్యాక్సిన్ల‌కంటే ప‌వ‌ర్‌ఫుల్‌..

క‌రోనా వైర‌స్‌ను అంతం చేసేందుకు ఎంతో మంది శాస్త్ర‌వేత్త‌లు వ్యాక్సిన్లు క‌నిపెడుతూనే ఉన్నారు. ప్ర‌పంచ దేశాలు క‌రోనా వ్యాక్సిన్ త‌యారుచేసే ప‌నిలో బిజీగా ఉన్నాయి. ఇప్ప‌టికే ర‌ష్యా ఓ వ్యాక్సిన్‌ను తుదిశ‌లో ప్ర‌యోగాలు చేస్తూ రెండో వ్యాక్సిన్‌ను కూడా తెచ్చింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో క‌రోనా వైర‌స్‌కు ఏది స‌రైన వ్యాక్సినో అర్థం కావడం లేదు చాలా మందికి.

ఇంత‌వ‌ర‌కు వ్యాక్సిన్‌ను క‌నిపెడుతున్న వారంద‌రూ ఇంజెక్ష‌న్ ద్వారా వ్యాక్సిన్ వేయ‌డ‌మే చెబుతున్నారు. అయితే ఇప్పుడు నేరుగా ముక్కు ద్వారా టీకాను పంపించి గొంతులో ఎటువంటి వైర‌స్‌లు రాకుండా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకునేందుకు కృషి చేస్తున్నారు. ఇందుకోసం భార‌తీయ అమెరికన్ శాస్త్ర‌వేత్త కొత్త మందు తీసుకొచ్చారు. దీన్ని నేరుగా ముక్కు ద్వారా లోప‌లికి పంపిస్తారు. దీని వ‌ల్ల మ‌న శరీరంలోకి ఎక్క‌డైతే వైర‌స్‌లు ప్ర‌వేశిస్తాయో అక్క‌డే వానికి అంతం చేయొచ్చు.

క‌రోనా వైర‌స్ వంటి వైర‌స్‌లు స్పైక్ ప్రోటీన్ల స‌హాయంతో ఆతిథ్య క‌ణాల్లోకి వ‌స్తాయంట‌. అందుకే ఇప్పుడు వీరు త‌యారుచేస్తున్న మందు ఈ ప్రోటీన్ల‌ను నాశ‌నం చేస్తుంది. అంతేకాకుండా ఇది శ‌రీరం మొత్తం రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఈ టీకాను మ‌రింత అభివృద్ధి చేసేందుకు భార‌తీయ అమెరిక‌న్ శాస్త్ర‌వేత్త వ‌ర‌ద‌రాజ‌న్ కృషి చేస్తుంటే.. ఇత‌నితో హ్యూస్ట‌న్ విశ్వ‌విద్యాల‌యం క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధ‌మైంది. వైర‌స్‌ను నేరుగా ప్ర‌వేశించే ప్రాంతంలోనే అడ్డుక‌ట్ట వేసే వ్యాక్సిన్లు రావాల‌ని ప‌బ్లిక్ సైతం కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here