టిక్ టాక్‌పై మ‌ళ్లీ వెన‌క్కు త‌గ్గిన ట్రంప్ స‌ర్కార్‌.. కార‌ణం ఇదేనా.

అమెరికాలో టిక్ టాక్ నిషేధం విధించి ట్రంప్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆదివారం నుంచి అమెరికాలో టిక్‌టాక్‌, వి చాట్‌లు నిషేధించిన‌ట్లు ట్రంప్ ప్ర‌క‌టించారు. అయితే దీనిపై తాజాగా వెన‌క్కు త‌గ్గిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి కొన్ని రోజులు గ‌డువు ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు.

దేశ భ‌ద్ర‌త‌కు సంబంధించి అమెరికాలో చైనా యాప్ అయిన టిక్ టాక్‌, వీ చాట్‌లు నిషేధిస్తూ తీసుకున్న నిర్ణ‌యం ట్రంప్ వెనక్కు తీసుకున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే టిక్ టాక్ యాజ‌మాన్యం ఒరాకిల్‌తో ఒప్పందం కుదుర్చుకుందన్న టాక్ వినిపిస్తోంది. ఒరాకిల్‌, వాల్‌మార్ట్ క‌లిసి భాగ‌స్వామ్యంగా టిక్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ వాల్ మార్ట్ టిక్‌టాక్‌ను ద‌క్కించుకోవాల‌ని అనుకున్నా అది జ‌ర‌గ‌లేదు. చివ‌ర‌కు ఒరాకిల్‌, వాల్‌మార్ట్‌కే టిక్ టాక్ యాజ‌మాన్యం వేదిక అవ్వ‌నుంది.

టిక్‌టాక్‌, ఒరాకిల్‌ మధ్య డీల్‌కు అమెరికా ప్రభుత్వం ఇంకా అధికారిక ఆమోదముద్ర వేయలేదు. అయితే ట్రంప్ మాత్రం దీనిపై ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతకు ముప్పు ఉన్న నేప‌థ్యంలో అమెరికాకు చెందిన సంస్థకే టిక్ టాక్ యాజ‌మ‌న్యం ఇవ్వాల‌ని ట్రంప్ చెబుతున్నారు. ఈ నెల 27వ తేదీ వ‌ర‌కు నిషేధానికి విధించిన గ‌డువును పెంచిన‌ట్లు స‌మాచారం. అమెరికాలో టిక్ టాక్ 1.84 ల‌క్ష‌ల కోట్లుగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే ఇందుకు ట్రంప్ ఏ మాత్రం ఒప్పుకుంటార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. టిక్ టాక్ విష‌యంలో ప్ర‌తి విష‌యాన్ని సీరియ‌స్‌గానే తీసుకుంటున్నారు ట్రంప్‌. మ‌రి టిక్ టాక్ అమెరికాలో వస్తుందో లేదో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here