ఆ ఐదు రాష్ట్రాలు చాలా కీల‌కం.. ఏపీ, తెలంగాణ సేఫ్‌..

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి బారి నుంచి తెలుగు రాష్ట్రాలు ఊపిరి పీల్చుకున్న‌ట్లే అనిపిస్తోంది. ఎందుకంటే దేశ వ్యాప్తంగా ఉన్న ప‌రిస్థితిని బ‌ట్టి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల‌లో న‌మోదవుతున్న మ‌ర‌ణాలు చాలా త‌క్కువ‌. దీంతో మొన్న‌టి వ‌ర‌కు టాప్ లిస్టులో ఉన్న ఏపీ కూడా ఇప్పుడు టాప్ 5లో లేదు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లో క‌రోనా ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చిన‌ట్లు అనుకోవ‌చ్చు. ఎందుకంటే కేసులు న‌మోదువుతున్న‌ప్ప‌టికీ మ‌ర‌ణాల సంఖ్య మాత్రం టాప్ 5 స్టేట్స్‌లోనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణ ఇందులో లేవు. ఇక దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్న‌ట్లు అనిపిస్తోంది. అయితే కేసులు ఎన్ని పెరిగినా రిక‌వ‌రీ రేటు మాత్రం పెరుగుతోంది. మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గుతూ వ‌స్తోంది. దేశంలో రిక‌వ‌రీ శాతం 91 శాతం ఉంది. దీన్ని బ‌ట్టి ఏ విధంగా భార‌త్‌లో ప్ర‌జ‌లు క‌రోనా నుంచి కోలుకుంటున్నారో మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు.

దేశంలో మ‌ర‌ణాల సంఖ్య ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో మ‌హారాష్ట్ర టాప్‌లో ఉంది. ఈ రాష్ట్రంలో దేశంలోని మొత్తం మ‌ర‌ణాల్లో 36.04 శాతం, క‌ర్నాట‌క 9.16 శాతం, త‌మిళ‌నాడు 9.12 శాతం , యూపీ 5.76 శాతం, ప‌శ్చిమ‌బెంగాల్ 5.58 శాతంగా ఉంది. ఇక ప్ర‌పంచ దేశాలతో పోలిస్తే భార‌త్‌లో మ‌ర‌ణాల సంఖ్య చాలా త‌క్కువ‌గానే ఉంద‌ని చెప్పొచ్చు. ఇక కేసుల విష‌యంలో కూడా భార‌త్ మంచి ప‌రిస్థితుల్లోనే ఉంది. ఇత‌ర దేశాల్లో ప‌రిస్థితులు మ‌ళ్లీ చేజారిపోతుండ‌టంతో లాక్‌డౌన్ విధించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇండియాలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల వ‌ల్ల మంచి ఫలితాలు వ‌స్తున్నాయి. క‌రోనా కేసుల ప‌రీక్ష‌లు చేయ‌డం, వైద్యం విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు బాగా ప‌నిచేస్తున్నాయి. ఇందువ‌ల్ల క‌రోనా నుంచి ప్ర‌జ‌లు త్వ‌ర‌గానే కోలుకుంటున్నారు. 65 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు దాటిన వారు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here