వై.ఎస్ జ‌గ‌న్ ప్లాన్ ఏంటో తెలుసా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం రాజ‌కీయాలు వేడెక్కాయి. ఏ విష‌యంలోనైనా ప్ర‌భుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్ట‌డ‌మే లక్ష్యంగా ప్ర‌తిప‌క్షపార్టీలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. దీంతో అన్నింటినీ త‌ట్టుకొని జ‌గ‌న్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం చాక‌చ‌క్యంగానే వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని తెలుస్తోంది. రాష్ట్రానికి చాలా ముఖ్య‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టులు ఎలాగైనా పూర్తి చేసేందుకు సీఎం జ‌గ‌న్ ఫిక్స్ అయ్యారు. ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోసం ఆయ‌న ఎలాగైనా ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాల‌నుకుంటున్నారు. పెరిగిన వ్య‌యం సంబంధం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతున్నా జ‌గ‌న్ మాత్రం ధీమాగానే ఉన్నారు. ఈ మేర‌కు పోల‌వ‌రం క‌ట్టాల్సిన బాద్య‌త కేంద్రానిదే అని ప్ర‌భుత్వం స్ప‌ష్టంగా చెబుతోంది. ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్ ప్ర‌ధానికి లేఖ కూడా రాశారు.

2021 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ కట్టి తీరుతామని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. పోలవరం కట్టాల్సిన పూర్తి బాధ్యత కేంద్రానిదే అన్నారు. పోలవరాన్ని కేంద్రమే నిర్మిస్తుందని విభజన చట్టంలో ఉంద‌ని..ఆలస్యమయ్యే కొద్దీ ప్రాజెక్ట్‌ వ్యయం పెరుగుతుందన్నారు. పునరావాసం బాధ్యత కూడా కేంద్రానిదే అన్నారు. వైఎస్‌ హయాంలో చేసిన ప్రాజెక్ట్‌ పనులనే చంద్రబాబు చెప్పుకున్నార‌ని.. చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరంలో ఇబ్బందులు వ‌చ్చాయ‌న్నారు.

ఎలాగైనా పోల‌వ‌రం పూర్తి చేసి రైతుల‌కు మేలు చేయాల‌న్న సంక‌ల్పంతో జ‌గ‌న్ ఉన్నట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. రాబోయే ఎన్నిక‌ల‌కు వెళ్లాలంటే ముందుగా రైతుల కోసం పోల‌వ‌రం పూర్తి చేయాల్సిన బాద్య‌త త‌మ‌పై ఉంద‌ని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఏది ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పోల‌వ‌రం పూర్తి చేసేలా జ‌గ‌న్ కేంద్ర ప్ర‌భుత్వంతో మాట్లాడ‌తార‌ని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here