అమెరికా అధ్య‌క్ష్య ఎన్నిక‌ల్లో ట్రంప్‌కు కావాల్సింది ఇదే..

అమెరికాలో అద్య‌క్ష్య ఎన్నిక‌ల టెన్ష‌న్ కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌పంచం మొత్తం ఇప్పుడు అమెరికా ఎన్నిక‌ల గురించే ఆలోచిస్తోంది. డెమొక్రటిక్ పార్టీ అభ్య‌ర్థి జో బైడెన్ విజ‌యానికి ద‌గ్గ‌ర్లోనే ఉన్నారు. అయితే ప్ర‌ధానంగా ట్రంప్ కోరుకుంటోంది ఒక్క‌టే.

ట్రంప్ నిన్న విజ‌యం త‌న‌దే అని ప్ర‌క‌టించారు. అయితే ఆ త‌ర్వాత అనూహ్యంగా జో బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. ప్ర‌స్తుతం బైడెన్‌కు 264 ఎలక్టోరల్ ఓట్లు వ‌చ్చాయి. అదే ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇక్క‌డ ప్ర‌ధానంగా ట్రంప్ మెయిల్ ఇన్ బ్యాలెట్ ఓట్లలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. డెమొక్రటిక్ పార్టీ అక్రమాలకు పాల్పడిందంటూ.. రీకౌంటింగ్ నిర్వహించాలంటూ.. పోలింగ్ తేదీ తర్వాత వచ్చిన బ్యాలెట్ ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దంటూ ట్రంప్ న్యాయపోరాటానికి సిద్ద‌మ‌య్యారు.

పెన్సిల్వేనియా (20), మిచిగాన్ (16), విస్కిన్సన్ (10), జార్జియా (16) రాష్ట్రాల విషయంలో ట్రంప్ రీకౌంటింగ్‌కు పట్టుబడుతున్నారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి 62 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఇప్పటికే ట్రంప్‌కు 214వరకు ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. పెన్సిల్వేనియాలో బ్యాలెట్ ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఈ బ్యాలెట్ ఓట్లు బైడెన్‌కు ఎక్కువగా పోలయ్యాయని రిపబ్లికన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీటిల్లో బైడెన్‌కు మొగ్గుచూపితే ఫలితం తారుమారయ్యే ఛాన్స్ ఉందన్నది ట్రంప్ వర్గీయుల ఆందోళన.

మిచిగాన్‌లో బైడెన్‌ గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఇక్క‌డ రీకౌంటింగ్‌కు ట్రంప్ ప‌ట్టుబ‌డుతున్నారు. విస్కిన్సన్ రాష్ట్రంలో కూడా ట్రంప్ రీకౌంటింగ్ కోరుతున్నారు. దీంతో ట్రంప్ విష‌యంలో కోర్టు ఏమ‌ని తీర్పు ఇస్తుందో అన్న టెన్ష‌న్ నెల‌కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here