టీడీపీ వ్యవస్థాపకులు, లెజెండ్రీ ఎన్టీఆర్ అంటే ప్రతీ ఒక్క తెలుగువాడికీ ఎప్పటికీ గౌరవమే. ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకి ఆయన పేరు చెప్తే దేవుడితో సమానం అన్నట్టు ఉంటారు. తాజాగా ఇంటింటికీ తెలుగుదేశం ప్రోగ్రాం ని ఏర్పటు చేసిన టీడీపీ ప్రతీ నియోజికవర్గం లో చురుగ్గా పాల్గొంటున్నారు . గుంటూరు జిల్లా పెదమాను కోటేశ్వరరావు అనే వ్యక్తి ఇంటికి అక్కడి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వెళ్లారు. అయితే తమ ఇంట్లో కొత్తగా పుట్టిన చిన్నారికి తమ ఎమ్మెల్యే నే నామకరణం చెయ్యాలి అని కోటేశ్వరరావు కోరడం తో శ్రీనివాసరావు తమ పార్టీ వ్యవస్థాపకులు, తన ఫేవరేట్ హీరో ఎన్టీఆర్ పేరుని తెలిపారు. ఎన్టీఆర్ పేరు అలా కాకుండా తారకరామ అని పెట్టుకోమన్నారు. ఆ చిన్నారికి పేరు పెట్టి కాసేపు వారితో ఉండి మరీ వచ్చారు శ్రీనివాసరావు. మే 28 న ఎన్టీఆర్ జన్మదినం రోజునే ఈ చిన్నారి కూడా జన్మించాడు. ‘తారకరామ’ పేను పెట్టడంపై చిన్నారి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.