మీకు దండం పెడ‌తాం.. మా ఊరు రావొద్దు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు ఆస‌క్తిగా  మారుతున్నాయి. వైసీపీ అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి గ‌తంలో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాల‌పై త‌న‌దైన శైలిలో ముందుకు వెళుతూ బ‌య‌ట‌కు తీస్తున్న‌ విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా ప‌లువురు మాజీ మంత్రులు సైతం కేసులు ఎదుర్కొంటున్నారు.

అచ్చెన్నాయుడు, కొల్లు ర‌వీంద్ర‌, జేసీ ప్ర‌భాక‌ర్‌ రెడ్డిలు ఇటీవ‌ల అరెస్టై బెయిల్‌పై విడుద‌ల అయిన విష‌యం తెలిసిందే. ఇన్నాళ్లూ జూమ్ వీడియోలో మాత్ర‌మే క‌నిపిస్తున్న చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌డు ఈ నేత‌ల‌ను ప‌రామ‌ర్శించేందుకు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే అచ్చెన్నాయుడు, కొల్లు ర‌వీంద్ర‌ల‌ను చంద్ర‌బాబు క‌లిసి మాట్లాడారు.

ఇక ఇదే ప‌నిలో భాగంగా రాయ‌ల‌సీమ నేత జేసి ప్ర‌భాక‌ర్ రెడ్డిని కూడా క‌ల‌వాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న అన్న జేసి దివాక‌ర్‌ రెడ్డికి కాల్ చేసి క‌లుస్తాన‌ని కోర‌గా ద‌య‌చేసి మా ఇంటికి రావొద్దు అని చంద్రబాబుకు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక స‌మాచారం బ‌య‌ట‌కు రాలేదు.

వైసీపీ అధికారంలో ఉన్న‌న్ని రోజులు సైలెంట్‌గానే ఉండాల‌ని జేసీ నిర్ణ‌యించుకున్న‌ట్లు ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. చంద్ర‌బాబుతో అనుకూలంగా వ్య‌వ‌హ‌రించడం కూడా అంత మంచిది కాద‌ని భావిస్తున్నారంట‌. అన‌వ‌స‌ర విష‌యాల్లో జోక్యం చేసుకోకుండా కేవ‌లం కార్య‌క‌ర్త‌ల‌తోనే ట‌చ్‌లో ఉండాల‌ని అనుకుంటున్నార‌ని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు పరామ‌ర్శ‌కు వ‌స్తే మ‌ళ్లీ లేనిపోని రాజ‌కీయాలు మాట్లాడాల్సి వ‌స్తోంద‌ని.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మౌనంగా ఉండ‌ట‌మే మంచిద‌ని డిసైడ్ అయిన‌ట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here