ఆన్‌లైన్ క్లాసుల‌పై స‌ర్వేలు ఏమంటున్నాయంటే..

6-7 years cute child learning mathematics from computer.

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న కరోనా ప్ర‌భావం ఎవ్వ‌రిపైన పడిన ప‌డ‌క‌పోయినా క‌చ్చితంగా విద్యార్థుల‌పై ప‌డుతుంది. వ్యాపారాలు ఆగిపోయినా తిరిగి మ‌ళ్లీ పుంజుకుంటాయ‌న్న ధీమా ఉంది. అయితే రోజురోజుకూ కొత్త కొత్త విష‌యాలు నేర్చుకుంటున్న విద్యార్థుల‌పై హాలిడేస్ ప్రభావం చాలా ఉంటుంది.

ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వ‌హణ అనే అంశం తెర‌మీద‌కొస్తోంది. ఇప్ప‌టికే ప‌లు విద్యాసంస్థ‌లు ఆన్ లైన్ క్లాసులు నిర్వ‌హిస్తున్న‌య‌ని తెలుస్తోంది. అయితే నేరుగా స్కూల్‌కి వెళ్లి వింటే ఎలా ఉంటుంది. ఇంట్లోనో ఆన్‌లైన్‌లో క్లాసులు ఉంటే ఎలా ఉంటుంద‌న్న దానిపై భిన్న స్వ‌రాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే ఐక్య ఉపాధ్యాయ సంఘం (యూటిఎఫ్‌) ఓ స‌ర్వే నిర్వ‌హించింది. ఇందులో ప్ర‌ధానంగా ఆన్ లైన్ క్లాసులు కొంత‌వ‌ర‌కే ఉప‌యోగ‌మ‌ని 58.5 శాతం మంది తెలియ‌జేసినట్లు స‌మాచారం. 90.4 శాతం మంది త‌ర‌గ‌తుల్లోనే బోధ‌న ఉండాల‌ని చెప్పారు.

క‌రోనా ప్రభావం తక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో పాఠ‌శాల‌లు ఓపెన్ చేయాల‌ని 73.1 శాతం మంది, ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌లు తీసుకుంటే స్కూళ్ల‌కు పంపుతామ‌ని 50.1 మంది వెల్ల‌డించారు. టీవీల్లో చెప్పే చ‌దువులు స‌రిపోవ‌ని 92.3 శాతం మంది చెప్ప‌గా.. 29.6 శాతం మంది ఇప్ప‌ట్లో స్కూళ్ల‌కు పంప‌లేమ‌ని వారి అభిప్రాయాలు తెలిపిన‌ట్లు స‌ర్వే ద్వారా తెలిసింది.

ఏదిఏమైనప్ప‌టికీ క‌రోనా స‌మ‌యంలో పూర్తి స్తాయిలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మేధావులు సూచిస్తున్నారు. టీకా వ‌చ్చే వ‌ర‌కు వేచి ఉంటే మేల‌ని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here