చంద్రబాబు హైద‌రాబాద్‌లో దాక్కొని స‌వాల్ చేస్తున్నారు.. జోగి ర‌మేష్‌

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుపై వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ మండిప‌డ్డారు. చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో దాక్కొని స‌వాల్ చేస్తున్నార‌ని అన్నారు. బాబు త‌మ పార్టీకి స‌వాల్ విస‌ర‌డ‌మేంట‌న్నారు.

చంద్ర‌బాబుకు ధైర్యం ఉంటే మూడు రాజ‌ధానుల‌పై త‌న పార్టీ ఎమ్మెల్యేల‌తో ఆయ‌న రాజీనామా చేయించాల‌న్నారు. ఆయ‌న మాకు సవాల్ చేయ‌డ‌మేంట‌న్నారు. మేమే చంద్ర‌బాబుకు సవాల్ విసురుతున్నామ‌న్నారు.

గ‌తంలో కేసీఆర్ తెలంగాణ వాదం మీద ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లార‌ని.. ఇప్పుడు చంద్ర‌బాబు ఎందుకు అమ‌రావ‌తిపై ఉప ఎన్నికల‌కు వెళ్లేందుకు భ‌య‌ప‌డుతున్నార‌న్నారు. అన్ని ప్రాంతాలు స‌మానంగా అభివృద్ధి చెందాల‌న్న‌దే త‌మ పార్టీ అధినేత సీఎం వై.ఎస్ జ‌గ‌న్ ల‌క్ష్య‌మన్నారు.  త‌న ఎమ్మెల్యేలు ఓడిపోతార‌ని చంద్ర‌బాబు రాజీనామాలు చేయించ‌డానికి జంకుతున్నార‌న్నారు.

ఆయ‌న కావాల‌నే ఇలా చేస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here