బాలు జీవితం ఎంతో మందికి ఆదర్శం..

సుమారు 40 రోజులకిపైగా కరోనాతో పోరాడి చివరికి ఈరోజు (శుక్రవారం) చెన్నైలో తుదిశ్వాస విడిచారు గాయకులు బాల సుబ్రమణ్యం గారు. పాటకు ప్రాణం పోసిన గాన గాంధర్వుడు దివిగేకడంతో చిత్రసీమ తీవ్ర ధిగ్రాంభితిని వ్యక్తం చేస్తోంది. బాలు లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదని సోషల్మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. తరుణంలో బాలు జీవితంలోని అంశాలు మీకోసం..

తండ్రే గురువు..శ్రీపతి పండితారాధ్యుల బాలుసుబ్రమణ్యం.. 1946 జూన్‌ 4 నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేట గ్రామంలో జన్మించారు. ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగిన బాల సుబ్రమణ్యం జీవితం ఎంతో మందికి ఆదర్శం. బాలు తండ్రి సాంబమూర్తి హరికథా కళాకారుడు.. ఆయన భక్తిరస నాటకాలు కూడా ప్రదర్శించేవాడు. దీంతో బాలుకి చిన్నతనం నుంచే సంగీతం మీద ఆసక్తి పెరిగింది. ఇలా బాలుకి తండ్రే తొలి గురువయ్యారు. ఐదేళ్ల వయసులోభక్తరామదాసునాటకంలో తండ్రితో కలిసి నటించారు.

నలభై వేలకుపైగా పాటలు..నిజానికి ఎస్పీబీ ఇంజనీర్కావాలని కలలు కన్నారు.. కానీ గాయకుడిగా మారారు. బాలు శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న (1996) చిత్రంలో తొలిపాట పాడారు. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో పాటలు పాడిన బాలు యావత్దేశాన్ని ఉర్రూతలూగించారు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రస్థానంలో నలభై వేలకుపైగా పాటలు పాడి గిన్నిస్రికార్డును సాధించారు బాలు.

నటుడిగాను..కేవలం తెర వెనక పాటకే పరిమితం కాకుండా వెండి తెరపై కూడా కనిపించి తనదైన ముద్ర వేశారు బాల సుబ్రమణ్యం గారు. ప్రేమికుడు, రక్షకుడు, పవిత్రబంధం, మిథునం, వంటి చిత్రాల్లో నటించి నటుడిగాను అభిమానులను ఆకట్టుకున్నారు.

ఎన్నో అవార్డులు..బాలసుబ్రమణ్యం గానానికి ఎన్నో అవార్డులు కూడా దాసోహమయ్యాయి. భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్‌, పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. పలు చిత్రాలకు జాతీయ అవార్డులు సైతం అందుకున్నారు. 2012లో ఎన్టీఆర్జాతీయ పురస్కారం సహా, ఎనిమిది నంది అవార్డులను సొంతం చేసుకున్నారు బాలు

ఆ మధుర గానం మూగబోయింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here