ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు గుడ్ న్యూస్‌.. 25ల‌క్ష‌ల మందికి ఉపాధి వచ్చేస్తోందా..?

విభ‌జ‌న త‌ర్వాత ఆంధ్ర‌ప్రదేశ్ అభివృద్ధి చెందేందుకు అన్ని విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. కొత్త‌గా అధికారంలోకి వ‌చ్చిన వై.ఎస్ జ‌గ‌న్ స‌ర్కార్ అన్ని అవ‌కాశాలు ఇందుకోసం వాడుకుంటోంది. తాజాగా ఏపీలో ఫర్నిచ‌ర్ పార్క్ ఏర్పాటుకాబోతోంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే జ‌రిగితే ల‌క్ష‌ల్లో ఉపాధి అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌చ్చిన‌ట్లే.

ఏపీలో భారీ ఫ‌ర్నిచ‌ర్ పార్క్ ఏర్పాటు అవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌లో భాగంగా ఇది ఏపీకి రానుంది. నెల్లూరు జిల్లాలో దీన్ని ఏర్పాటు చేసేందుకు క‌స‌రత్తులు జ‌రుగుతున్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్ర‌మోష‌న్ ఆఫ్ ఇండ‌స్ట్రీ అండ్ ఇంట‌ర్న‌ల్ ట్రేడ్ అధికారులు శ్రీ‌సిటీ స‌మీపంలో ఇప్ప‌టి్కే స్థ‌లాన్ని కూడా ప‌రిశీలించారు. అన్ని అవ‌కాశాలు ఈప్రాంతంలో ఉండ‌టంతో ఇక్క‌డే దీన్ని పెట్టాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఎందుకంటే చెన్నై, కృష్ణ‌ప‌ట్నం రేవుల‌కు ద‌గ్గ‌రగా ఉండ‌టంతో పాటు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు అనువైన ప్రాంతంగా దీన్ని ఎంపిక చేశార‌ని టాక్‌. ఈ పార్క్ ఏర్పాటుకోసం 1500 ఎక‌రాలు సిద్ధం చేస్తున్నారు. ఇది ఏర్పాటైతే 25 ల‌క్ష‌ల మందికి ఉపాది దొరుకుతుంది. అంత‌ర్జాతీయంగా ప్ర‌తి సంవ‌త్స‌రం 20 ల‌క్ష‌ల కోట్ల ఫ‌ర్నిచ‌ర్ వ్యాపారం జ‌రుగుతుంటే అందులే ఇండియా నుంచే 3 నుంచి 4 లక్ష‌ల కోట్ల వ్యాపారం సొంతం చేసుకోగల‌గాల‌న్న భావ‌న‌తో ప్ర‌భుత్వం ఉంది. అయితే ఏపీ కూడా అందివ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌డానికి సిద్ధంగా లేదు. ప్రభుత్వం అన్ని విధాలా రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌లు రావాల‌నే ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here