నాలుగు నెల‌ల ముందే హౌస్ ఫుల్‌..

ప‌రిస్థితులు కాస్త చ‌క్క బ‌డితే చాలు ప్ర‌యాణాలు చేయ‌డానికి ప్ర‌జ‌లు ముందుకు వ‌స్తారు. అలాంటిది క‌రోనా స‌మ‌యం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డకు వెళ్ల‌కుండా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైన వారు ఇప్పుడిప్పుడే కార్యాల‌యాల‌కు వెళ్తున్నారు. దీంతో అన్ని రిజ‌ర్వేష‌న్లు హౌస్ ఫుల్ అంటున్నాయి.

లాక్ డౌన్ స‌మ‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు పెద్ద పెద్ద న‌గ‌రాల్లోని చాలా కంపెనీలు మూత ప‌డ్డాయి. అంటే ఇంటి నుంచే ప‌ని చేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే కాస్త క‌రోనా నుంచి కోలుకొని మళ్లీ కార్యాల‌యాల‌కు వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగానే రిజ‌ర్వేష‌న్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు హైద‌రాబాద్‌, బెంగుళూరు లాంటి న‌గ‌రాల‌కు వెళ్తున్న వారు సంక్రాంతికి త‌మ సొంతూళ్ల‌కు ఇప్ప‌టి నుంచే బుక్ చేసుకుంటున్నారు.

రైల్వే శాఖ ఇప్పుడిప్పుడే బుకింగ్స్ ఓపెన్ చేసింది. దీంతో వెంట‌నే పబ్లిక్ బుక్ చేసేసుకున్నారు. సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని నాలుగు నెల‌ల ముందుగానే ఈ బెర్తుల‌న్నీ బుక్ చేసుకున్నారు. దీంతో ఇప్పుడు బుక్ చేసుకోవాల‌ని అనుకునే వారికి అవ‌కాశ‌మే లేకుండా పోయింది. ప్ర‌జ‌లు ఇంత అడ్వాన్స్‌గా ఉన్నారేంటా అని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

పండుగ స‌మ‌య‌మంటే మామూలుగానే బుకింగ్స్ ఉండ‌వు అలాంటిది ఇది క‌రోనాటైం కాబ‌ట్టి ముందే బుక్ చేసుకోవాల‌ని ప‌బ్లిక్ నిర్ణ‌యించుకున్నారు. పైగా బ‌స్సులు కూడా ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్ల‌డం లేదు. ఈ ప‌రిస్థితుల్లో ఆన్‌లైన్ బుకింగ్స్ గిరాకీ పెరిగిపోయింది. అందుకే రైల్వే శాఖ‌ బుకింగ్స్‌ ఓపెన్ చేయ‌గానే సీటు ప‌ట్టేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here