ఎన్‌సీబీ విచారణలో రకుల్‌.. ఆందోళనలో దర్శకనిర్మాతలు.?

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య అటుతిరిగి, ఇటు తిరిగి చివరికి బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వ్యహరానికి తెరతీసింది. సుశాంత్‌ మరణం నేపథ్యంలో అతని గర్ల్‌ ఫ్రెండ్‌ నటి రియా చక్రవర్తిని పోలీసులు విచారిస్తోన్న క్రమంలో డ్రగ్స్‌ అంశం బయటపడింది. ఇండస్ట్రీకి చెందిన కొందరు నటీమణలు డ్రగ్స్‌ వాడుతున్నారని రియా పోలీసులకు తెలపడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ గా మారింది.

ఈ క్రమంలోనే తాజాగా నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎన్‌సీబీ ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అధికారులు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను విచారిస్తున్నారు. ఇందులో భాగంగా రకుల్‌పై ఎన్‌సీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని తెలుస్తోంది. రియాతో మీకెలాంటి సంబంధాలున్నాయి? రియా నుంచి డ్రగ్స్‌ తీసుకున్నారా? సుశాంత్‌ ఫామ్‌హౌజ్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీలో పాల్గొన్నారా.? వంటి సమాచారాన్ని రకుల్‌ నుంచి రాబట్టుతున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఓ వైపు రకుల్‌ విచారణ జరుగుతుంటే మరోవైపు ఆమెతో చిత్రాలను మొదలు పెట్టిన దర్శక,  నిర్మాతలు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జరగరాంది జరిగి రకుల్‌ డ్రగ్స్‌ కేసులో రకుల్‌ అరెస్ట్‌ అయితే తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కరోనా కారణంగా చాలా రోజుల పాటు వాయిదా పడ్డ చిత్ర షూటింగ్‌ ఇప్పుడు రకుల్‌ విచారణ అంటూ తిరుగుతుంటే మా పరిస్థితి ఏంటని దర్శకనిర్మాతలు వాపోతున్నారట.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగులో ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో ఓ  సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా,  తమిళంలో రెండు చిత్రాలు, హిందీలో ఒక చిత్రంలో నటిస్తోంది. మరి రకుల్‌ భవిత్యమేంటో తేలాలంటే ఎన్‌సీబీ విచారణ పూర్తయ్యేవరకు వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here