జ‌గ‌న్‌తో భేటికి సిద్ద‌మైన సోనియా..? బీజేపీ ప‌రిస్థితి ఏంటి..

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఏపీ సీఎం వై.ఎస్ జ‌గ‌న్‌తో సమావేశం అవుతున్నార‌న్న పుకార్లు ఎక్కువ‌వుతున్నాయి. దేశంలో ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పే నాయ‌కుడు కూడా క‌రువ‌వుతున్నారు. గ‌త రెండు ఎన్నిక‌ల నుంచి బీజేపీ హ‌వా కొన‌సాగుతూనే ఉంది.

కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభ‌వం సాధించాలంటే పూర్తి స్తాయిలో ప్ర‌క్షాళ‌న జ‌ర‌గాల‌ని భావిస్తోంది. ఇటీవ‌లె సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో సైతం నాయ‌క‌త్వంపై చ‌ర్చ జ‌రిగింది. దేశంలో ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పార్టీ మ‌నుగ‌డ కొన‌సాగించాలంటే అన్ని రాష్ట్రాల మ‌ద్ద‌తు అవ‌స‌రం అన్న ఆలోచ‌న‌కు కాంగ్రెస్ పార్టీ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అందుకే ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తే క‌చ్చితంగా వై.ఎస్ జ‌గ‌న్‌తో భేటీ అవ్వాల‌ని అధినేత్రి యోచిస్తున్న‌ట్లు స‌మాచారం.

వై.ఎస్ జ‌గ‌న్‌కు దేశంలోనే మంచి గుర్తింపు వ‌చ్చింది. అభివృద్ధి నుంచి అన్ని ర‌కాలా నివేదిక‌ల్లో అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల కంటే జ‌గ‌న్ మంచి ప్లేస్‌లోనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో కేవ‌లం రాష్ట్ర విభ‌జ‌న‌తోనే ఏపీలో కాంగ్రెస్ గ‌ల్లంతైన విష‌యం తెలిసిందే. దీంతో ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తుతో రానున్న ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వ్వాల‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు భావిస్తున్నారంట‌.

మ‌రి ఏపీకి సోనియా వ‌స్తే జ‌గ‌న్ తో భేటి అవ్వాల‌నుకుంటున్న వార్త‌ల్లో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది. ఒక‌వేళ సోనియా జ‌గ‌న్‌తో భేటి అవ్వాల‌నుకున్నా జ‌గ‌న్ అందుకు ఒప్పుకుంటారా అంటే చాలా మంది నో అంటున్నారు. కాంగ్రెస్‌కు వైసీపీకి ఉన్న దూర‌మెంతో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. పైగా ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో వైసీపీకి మంచి దోస్తీ ఉంద‌న్న వార్త‌లు ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ సోనియాతో భేటికి చాన్స్ వ‌స్తే ఒప్పుకుంటారా అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here