అశ్లీల ఫోటోల‌పై స్పందించిన సోనాక్షి సిన్హా.

అమ్మాయిల ఫోటోలు తీసుకొని అశ్లీలంగా త‌యారుచేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘ‌ట‌న‌లు ఎక్కువ‌వుతున్నాయి. ఈ మేర‌కు పోలీసులు ప‌లువురిని అరెస్టులు కూడా చేస్తున్నారు. కాగా హీరోయిన్ సోనాక్షి సిన్హా ఈ ఘ‌ట‌న‌ల‌పై పోరాటం చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు.

ఆన్‌లైన్ వైధింపులు నివారించేందుకు మ‌హారాష్ట్ర పోలీసుల‌తో సోనాక్షి చేతులు క‌లిపారు. ఓ కార్యక్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. వేధింపులు అంతం చేసేందుకు మిష‌న్ జోష్ కార్య‌క్ర‌మం ప్రారంభిచిన‌ట్లు సోనాక్షి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల‌కు ఆన్‌లైన్ వేధింపుల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తారు. ఈమేర‌కు స్పెష‌ల్ ఐజీపీ ప్ర‌తాప్ దిఘ‌వ్ క‌ర్‌తో మాట్లాడారు.

ఫోటోల‌ను అశ్లీలంగా మార్చి వేధింపులకు గురిచేయడం ఈ మ‌ధ్య ఎక్కువ అవుతోంది. అందుకే ఇక చాలు ఆన్ లైన్ వేధింపులు ఇక ఉండ‌కూడ‌దు అని ఆమె ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. మ‌రి సోనాక్షి ప్ర‌య‌త్నం స‌క్సెక్ కావాల‌ని.. అశ్లీల దృశ్యాల వేధింపుల ఘ‌ట‌న‌లు ఉండ‌కూడ‌ద‌ని అంతా ఆశిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here