చ‌లికి వ‌ణికిపోయిన అమితాబ్ బ‌చ్చ‌న్‌

రాత్రి పూట నిద్ర ప‌ట్టేది కాదు. చూడ‌టానికి ఒక్క మ‌నిషి కూడా ఉండ‌రు. అప్పుడప్పుడూ వ‌చ్చే వారు వారి ప‌నిచూసుకుని వెళ్లిపోయేవారు. చ‌లికి వ‌ణికిపోయాను. ఇవి ఎవ‌రో సామాన్యులు చెప్పిన మాట‌లు కాదు. బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌న‌సులోని మాట‌లు.

క‌రోనా వ‌చ్చి అమితాబ్ కుటుంబం మొత్తం ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఇదే స‌మ‌యంలో అక్క‌డ ఎలాంటి ప‌రిస్థితి ఉండేదో అబితాబ్ బ‌య‌టి ప్ర‌పంచంతో పంచుకున్నారు. రాత్రి పూట చ‌లికి వ‌ణికిపోయిన‌ట్లు అమితాబ్ చెప్పారు. కళ్లు మూసుకొని చీక‌టి రాత్రిలో పాట‌లు పాడాన‌న్నారు.

క‌రోనా రోగులు రోజుల త‌ర‌బ‌డి మ‌నుషుల‌ను చూడ‌రు. ఇది వారి మాన‌సిక స్థితిపై ప్ర‌భావం చూపుతుంద‌న్నారు. ఐసోలేష‌న్‌లో ఉన్న మ‌న‌షుల‌ను చూసేందుకు ఒక్క‌రూ రారు. డాక్ట‌ర్లు, న‌ర్సులు వ‌చ్చినా పీపీఈ కిట్లు ధ‌రించే ఉంటార‌న్నారు. అయితే ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇదే మంచిద‌న్నారు. అయితే పేషెంట్‌ను వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించేవారు ఎవ్వ‌రూ ఉండ‌ర‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here