అట్ట‌హాసంగా హీరో నితిన్ పెళ్లి.. హాజ‌రైంది వీరే.

హీరో నితిన్ వివాహం హైద‌రాబాద్‌లో వైభ‌వంగా జ‌రిగింది. క‌రోనా నేప‌థ్యంలో ప‌రిమిత సంఖ్య‌లో హాజ‌రైన అతిథులు బంధువుల స‌మ‌క్షంలో నితిన్ వివాహ కార్య‌క్ర‌మం ముగిసింది.

హైద‌రాబాద్‌లోని ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌లో ఆదివారం రాత్రి నితిన్‌, షాలినీలు ఒక్క‌ట‌య్యారు. త‌న స్నేహితురాలైన షాలినీని జీవిత‌భాగ‌స్వామిగా చేసుకుంటూ నితిన్ మూడుముళ్లు వేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సినీ రంగం నుంచి వ‌రుణ్ తేజ్‌, సాయి తేజ్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

నితిన్‌, షాలినీల జంట‌ను ఆశీర్వ‌దించేందుకు తెలంగాణ మంత్రులు త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్‌, నిరంజ‌న్ రెడ్డి, శ్రీ‌నివాస్ గౌడ్ హాజ‌ర‌య్యారు. తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత కూడా హాజ‌రై నితిన్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. కాగా నితిన్ పెళ్లి సంద‌ర్బంగా ఆయ‌న కొత్తగా న‌టిస్తున్న రంగ్ దే సినిమా టీజ‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌తో క‌లిసి నితిన్ న‌టిస్తున్నారు. విడుద‌ల చేసిన టీజ‌ర్‌లో కూడా పెళ్లికి సంబంధించిన సీన్లు ఉండ‌టం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here