షాకింగ్ న్యూస్‌.. రెండేళ్ల వ‌ర‌కు వ‌ర‌కు క‌రోనా వ్యాక్సిన్ రాదు..

క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలో షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఎప్పుడెప్పుడు వ‌స్తుంద‌ని ఎదురుచూస్తున్న క‌రోనా వ్యాక్సిన్ రెండు సంవ‌త్స‌రాల వ‌ర‌కు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని సీసీఎంబీ డైరెక్ట‌ర్ చెప్పారు. దీంతో క‌రోనా వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్న కోట్లాది మంది ప్ర‌జ‌లు షాక్‌లో ప‌డిపోయారు.

క‌రోనా వ్యాక్సిన్ మ‌రో నాలుగు నెల‌ల్లో అందుబాటులోకి వ‌స్తుంద‌ని అంతా అనుకుంటున్నారు. అయితే ఇలాంటి స‌య‌యంలో సీసీఎంబీ డైరెక్ట‌ర్ రాకేష్ మిశ్రా చేదు వార్త చెప్పారు. రెండు సంవ‌త్స‌రాల వ‌ర‌కు క‌రోనా వ్యాక్సిన్ వ‌చ్చే అవ‌కాశం లేద‌న్నారు. ఇక క‌రోనా వైర‌స్‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్ద‌ని మ‌రోసారి ఆయ‌న ప్ర‌జ‌ల‌కు సూచించారు. భార‌త్‌లో క‌రోనా త‌గ్గిపోయింద‌నుకుంటే మ‌నం పొర‌ప‌డిన‌ట్లే అన్నారు. ప్ర‌జ‌లు అపోహ‌లు వీడి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు.

భారత్ బయోటెక్, అరబిందో ఫార్మా సహా వివిధ కంపెనీలతో కలిసి.. వ్యాక్సిన్‌ కోసం పరిశోధనలు జ‌రుపుతున్న‌ట్లు చెప్పారు. పుట్టగొడుగుల్లో ఉండే పదార్థం, ఏఐసీతో కలిసి.. ఇమ్యూనిటీ బూస్టర్‌ను అభివృద్ధి చేశామన్నారు. ఆహారంతో కలిపి ఈ ఇమ్యూనిటీ బూస్టర్‌ను తీసుకోవాలని తెలిపారు. అయితే కోట్ల మందికి వ్యాక్సిన్ తీసుకురావ‌డం అంత ఈజీ కాద‌న్న ఆయ‌న ఇది చాలా క‌ష్ట‌మైన వ్య‌వ‌హారం అన్నారు. 2021 సంవ‌త్స‌రం దీనిపై ఓ క్లారిటీ వ‌స్తుంద‌ని తెలిపారు. పరిశోధనలతో పాటు అదృష్టం కూడా కలసి రావాలని రాకేష్ మిశ్రా తెలిపారు.

కాగా కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం వ‌చ్చే ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్ వ‌స్తుంద‌న్న క్లారిటీ ఇస్తోంది. ఇప్ప‌టికే దీనికి సంబంధించి వ్యాక్సిన్ వ‌చ్చిన త‌ర్వాత ఏ విధంగా దీన్ని పంపిణీ చేయాల‌న్న దానిపై కూడా కేంద్రం కస‌ర‌త్తులు చేస్తోంది. అయితే ఈయ‌న వ్యాఖ్య‌ల‌తో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న నెల‌కొంది. మ‌రి దీనిపై కేంద్రం ఏమైనా ప్ర‌క‌ట‌న చేస్తుందా అన్న‌ది వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here