రాజశేఖర్‌ ఆరోగ్యంపై స్పందించిన చిరు..

ఈ రోజు ఉదయం హీరో రాజశేఖర్‌ కూతురు చేసిన ట్వీట్‌తో ఒక్కసారిగా టాలీవుడ్‌ ఇండస్ట్రీ ఆందోళనకు గురైంది. ‘కోవిడ్‌తో నాన్న పోరాటం కాస్త కష్టంగా మారింది. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ దయచేసి ప్రార్థనలు చేయండి’ అని శివాత్మిక ట్వీట్‌ చేయడంతో ఒక్కసారిగా అందరూ ఆందోళనకు గురయ్యారు. తాజాగా శివాత్మిక చేసిన ట్వీట్‌కు నటుడు మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. రాజశేఖర్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్‌ చేశారు. శివాత్మిక ట్వీట్‌కు చిరు రిప్లై ఇస్తూ.. `డియర్ శివాత్మిక.. మీ ప్రియమైన నాన్న, నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. మా అందరి ప్రార్థనలు, మద్దతు ఆయనకు, మీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయి. ధైర్యంగా ఉండండ`ని చిరంజీవి పేర్కొన్నారు.

 

ఇదిలా ఉంటే తాజాగా సిటీ న్యూరో ఆసుపత్రి రాజశేఖర్‌ హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. రాజశేఖర్‌ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, వెంటిలేటర్‌ అవసరం లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపింది. దీంతో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవల రాజశేఖర్‌ కుటుంబమంతా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే కుటుంబసభ్యులంతా కరోనాను జయించగా.. ప్రస్తుతం రాజశేఖర్‌ చికిత్స పొందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here