సెహ్వాగ్ vs గంభీర్ .. ట్విట్టర్ లొల్లి

సోషల్ మీడియాలో సెటైర్ లు, వ్యంగ్యాస్త్రాలతో కూడిన ట్వీట్లు పోస్టు చేసి అభిమానులను అలరిస్తుండే సెహ్వాగ్ మరోసారి ట్విట్టర్లో చర్చకు తెరలేపాడు. భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ట్వీట్ పెడుతూ, “జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నా” అంటూ ఓ సాదాసీదా ట్వీట్ పెట్టాడు.
దీన్ని చూసి స్పందించిన గంభీర్, “శుభాకాంక్షలు చెప్పినందుకు కృతజ్ఞతలు. మీరు బాగానే ఉన్నారని అనుకుంటున్నా” అని సమాధానం ఇచ్చాడు. అదిగో.. అక్కడే సమస్య మొదలైంది. అసలు సెహ్వాగ్ కు ఏమైంది? ఆరోగ్యం బాగాలేదా? బాగానే ఉన్నారని అనుకోవడం ఏంటి? సెహ్వాగ్ మీకు ఏమైంది? అని రీట్వీట్లు వెల్లువెత్తాయి. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత డేంజరస్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్స్ జోడీల్లో గంబీర్ – సెహ్వాగ్ లు నిలిచారన్న సంగతి తెలిసిందే. ఇక తాజా ట్విట్టర్ గగ్గోలుపై సెహ్వాగ్ ఇంకా వివరణ ఇవ్వలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here