ఏపీలో తెరుచుకున్న పాఠ‌శాల‌లు.. కొత్త‌గా క‌రోనా కేసులు ఎన్నో తెలుసా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2,745 కరోనా కేసులు రికార్డయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 83,5,953కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 13 మంది మృతి చెందారు.

ఇప్పటివరకు కరోనాతో 6,757 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,878 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 8,07,318 మంది ఆసుపత్రుల నుంచి రికవరీ అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 84.27 లక్షల కరోనా టెస్టులు చేశారు. కృష్ణా 3, చిత్తూరు, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి కరోనాతో మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.

అయితే ఏపీలో పాఠ‌శాలలు తెరుచుకున్న విష‌యం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప‌లువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు క‌రోనా బారిన ప‌డుతున్నారు. స్కూళ్లకు వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. టెస్టుల్లో భారీగా పాజిటీవ్ కేసులు బయటపడుతుండడం కలకలం రేపుతోంది. టీచర్లు, విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. కరోనా దృష్ట్యా పిల్లలను స్కూళ్లకు పంపడానికి తల్లిదండ్రులు హడలిపోతున్నారు. మ‌రి దీనిపై ప్రభుత్వం ఏమైనా చ‌ర్య‌లు తీసుకుంటుందా అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇదిలాఉంటే తిరుప‌తి స‌మీపంలోని బుచ్చినాయుడు కండ్రిగ మండలం గోవిందప్ప నాయుడు కండ్రిగ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రెడ్డిపల్లి దినేష్ కరోనాతో మృతిచెందాడు. చెన్నైలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. దీంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. కాగా ఈయ‌న‌కు క‌రోనా ఎప్పుడు సోకింద‌న్న వివ‌రాలు తెలియ‌దు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here