స‌మంత విష‌యంలో అలా చేయ‌డం క‌రెక్టేనా..

చ‌నువు ఇస్తే ఎక్క‌డికైనా వెళ‌తారంటే ఇదేనేమో.. హీరోయిన్‌ స‌మంత ఎంత బిజీగా ఉన్నా సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఈ విష‌యం ఆమెను ఫాలో అవుతూ ఉన్న వారంద‌రికీ తెలిసిందే. ఎందుకంటే ఏ చిన్న కొత్త ప‌ని చేసినా ఆమె నెట్టింట్లో సభ్యులందరితోనూ షేర్ చేసుకుంటూ ఉంటారు.

తాజాగా లాక్‌డౌన్‌లో ఆమె ఇంట్లో కూర‌గాయ‌లు చెట్లు పెంచింది. అంతే కాకుండా ఈ రోజు మేము ఇది తింటున్నాం అది తింటున్నాం అంటూ వంట విష‌యాలు కూడా షేర్ చేసుకుంది. ఇక స‌మంత ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్ అయిన ఈమెకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇక నాగ‌చైత‌న్య‌ను వివాహం చేసుకున్నాక నాగ్ ఫ్యాన్స్ కూడా ఆమెకు యాడ్ అయ్యారు. ఇదంతా బాగానే ఉన్నా ఇటీవ‌ల ఓ అభిమాని ఆమెకు మెసేజ్ చేశాడు. ఫీలింగ్ గుడ్ అంటూ ఓ ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

దీనికి స్పందించిన ఓ నెటిజన్.. `చైతన్యకి విడాకులు ఇచ్చేయ్.. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం` అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు సమంత స్పందిస్తూ.. `కష్టం.. ఒక పని చెయ్.. చైని అడుగు` అని రిప్లై ఇచ్చింది. ఈ విష‌యంపై ప‌లువురు అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఏ స్ట‌యిల్లో మెసేజ్‌చేస్తే అదే స్ట‌యిల్‌లో రిప్లై ఇవ్వాల‌ని అంటూ కామెంట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here