స‌హాయం చేయ‌మ‌ని అడిగితే సోనూసూద్ ఎందుకు అలా అన్నాడు..

సోనూసూద్ ఈ లాక్‌డౌన్‌లో దేశ వ్యాప్తంగా అంద‌రికీ ప‌రిచ‌యం అయిపోయాడు. సినిమాల్లో న‌టిస్తూ ఆయ‌న అంద‌రికీ తెలిసిన‌ప్ప‌టికీ.. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఆయ‌న చేరువ‌య్యింది మాత్రం లాక్‌డౌన్‌లోనే. ఎందుకంటే ఆయ‌న చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాలు ఆయ‌న‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

క‌రోనాలో సహాయం చేసి అంద‌రి హృద‌యాలు దోచుకున్నారు సోనూసూద్‌. ఇత‌ర ప్రాంతాల నుంచి ప్ర‌జ‌ల‌ను వారి సొంత ఊళ్ల‌కు పంపించ‌డం కోసం ఆయ‌న చేసిన కృషి మామూలు విష‌యం కాదు. దీంతో పాటు సోష‌ల్ మీడియాలో ఆయ‌న ఎవ్వ‌రు స‌హాయం అడిగినా కాద‌న‌కుండా ముందుకు వ‌చ్చారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఎవ్వ‌రు హెల్ప్ అడిగినా సోనూ చేశారు. దాన‌వీర‌శూర‌క‌ర్ణుడిలా మారిన సోనూసూద్‌ని ప్ర‌శంసించ‌ని వారు ఉండ‌రు. తాజాగా యూపీకి చెందిన ఒక విద్యార్థి తాను చదువుకునేందుకు సాయం చేయాలని సోనూసూద్‌ను కోరారు.

ఆ విద్యార్థి ట్విట్టర్‌లో సార్.. మా నాన్నగారు పోయారు. అమ్మ గ్రామంలో ఆశావర్కర్‌గా పనిచేస్తోంది. మా ఇంటి ఆర్థిక పరిస్థితి బాగోలేదు. మాకు ఏడాదికి రూ. 40 వేల ఆదాయం లభిస్తుంది. యూపీ బోర్డు పరీక్షలో 88 శాతం, 12 వ తరగతిలో 76శాతం మార్కులు తెచ్చుకున్నాను. నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు సాయం చేయండి అని కోరాడు. వెంటనే సోనూసూద్ ఆ విద్యార్థికి ట్వీట్ లో మీ అమ్మతో నీ కొడుకు ఇంజినీర్ కాబోతున్నాడని చెప్పు అని తెలిపారు. ఈ ట్వీట్ చూసిన సోనూసూద్ అభిమానులు వివిధ రకాలుగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంచి టాలెండ్ ఉండి చ‌దువుకోవ‌డానికి స్థోమ‌త లేని విద్యార్థి సోనూ మాట‌ల‌తో సంతోషంగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here