చీర‌క‌ట్టులో అంద‌మైన రోబో..

త‌మిళ‌నాడులోని ఓ వ‌స్త్ర దుకాణంలో రోబో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒక్క రోబో రెండు విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుందంటూ చూసిన వారంతా న‌వ్వుకుంటున్నారు.

త‌మిళ‌నాడులోని ఓ షాపింగ్ కాంప్లెక్సులో రోబో శానిటైజ‌ర్ వేస్తోంది. క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో సిబ్బంది క‌స్ట‌మ‌ర్ల‌కు నేరుగా శానిటైజ‌ర్ వేయ‌డం అంత మంచిది కాద‌ని ఆ దుకాణం య‌జ‌మాని వినూత్నంగా ఆలోచ‌న చేశారు. షాపులో ఓ రోబోను పెట్టి చీర‌క‌ట్టి అలంక‌రించారు. దీంతో రోబోకు అంద‌మైన చీర‌క‌ట్టి ప‌బ్లిసిటీ చేసుకుంటున్నారు.

దీంతో పాటు రోబో క‌స్ల‌మ‌ర్ల వ‌ద్ద‌కు వెళ్లి శానిటైజ‌ర్ వేస్తోంది. అంతటితో ఆగ‌కుండా టెంప‌రేచ‌ర్ కూడా చెక్‌చేస్తోంది రోబో. దీంతో ఆషాపుకు వెళ్లే క‌స్ట‌మ‌ర్లంతా డిఫ‌రెంట్‌గా ఫీల‌వుతున్నారు. ఈ మేర‌కు రోబో చేస్తున్న ప‌నుల‌ను కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. హెల్ప‌ర్‌గా మారిన మోడ‌ల్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇండియాలో ప‌బ్జీ, లూడో నిషేధం..?
యోగా స్టైల్లో స‌మంత‌.. పండ‌గ చేసుకుంటున్న అభిమానులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here