సీక్వెల్ కోసం పోటీప‌డుతున్న రాంచ‌ర‌ణ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌

ఇండ‌స్ట్రీలో సీక్వెల్స్ ప‌రంప‌ర కొన‌సాగుతోంది. తాజాగా ఇదే వరుస‌లో మెగా పవ‌ర్ స్టార్ రాం చ‌ర‌ణ్ కూడా చేరిపోయారు. రంగ‌స్థ‌లం సినిమాను ఆయ‌న సీక్వెల్ చేయ‌బుతున్నార‌ని జోరుగా ప్ర‌చారాలు సాగుతున్నాయి.

సుకుమార్ డైరెక్ష‌న్‌లో రాం చ‌ర‌ణ్ మూవీ రంగ‌స్థ‌లం బాక్సీఫీసు వ‌ద్ద రికార్డులు సృష్టించింది. విభిన్నమైన పాత్రతో రాం చ‌ర‌ణ్ న‌టించిన ఈ చిత్రం మంచి హిట్ సాధించింది. ఇప్పుడు ఇదే సినిమా సీక్వెల్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని ఫిలిం న‌గ‌ర్‌లో చ‌ర్చ మొద‌లైంది. సుకుమార్ ఇప్పట‌కే క‌థ‌ను కూడా సిద్ధం చేసుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం సుకుమార్ బ‌న్నీతో ఓ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంట‌నే చ‌ర‌ణ్‌తో క‌లిసి రంగ‌స్థ‌లం 2కు రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక తెలుగు ఇండ‌స్ట్రీలో బంప‌ర్ హిట్ కొట్టిన అర్జున్‌రెడ్డి మూవీ కూడా సీక్వెల్‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్ల వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమాతో మంచి ఫాలోయింగ్‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ సొంతం చేసుకున్నారు.

ఈ నేప‌థ్యంలో అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్‌లో కబీర్ సింగ్ పేరుతో డైరెక్ట‌ర్ సందీప్ వంగ తీసి అక్క‌డ కూడా మంచి హిట్ సాధించారు. ఇప్పుడు మ‌ళ్లీ అర్జున్‌రెడ్డి 2 సినిమాను తీయాల‌ని విజ‌య్‌, సందీప్ మాట్లాడుతున్నార‌ని స‌మాచారం. మొత్తానికి కొత్త క‌థ‌ల వైపు ఆలోచ‌న‌లు చేయ‌కుండా తీసిన సినిమాలే మ‌ళ్లీ సీక్వెల్ చేసేందుకు ఇటు డైరెక్ట‌ర్ల‌తో పాటు హీరోలు కూడా సిద్ధ‌మ‌వుతున్నార‌న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here