కొత్త సినిమా కోసం రెడీ అవుతున్న ప‌వ‌ర్‌స్టార్‌..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త సినిమా త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నుందా. ప‌వ‌న్ పూర్తి స్థాయిలో సినిమాల‌పై దృష్టి పెట్ట‌నున్నారా.. తాజాగా ప‌వ‌న్ కొత్త స్టైల్ అందుకేనా..

తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టైల్ మార్చిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న జుత్తు, గ‌డ్డం పెంచిన ఫోటోలు ఇప్పుడు వైర‌ల్ అయ్యాయి. అయితే  లాక్‌డౌన్‌లో ప‌వ‌న్ ఇలా మారిపోయాడేమో అని అంద‌రూ అనుకుంటున్నా విష‌యం మాత్రం సినిమాల కోస‌మే అన్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా శ్రీ‌రామ్ డైరెక్ష‌న్‌లో దిల్ రాజ్ నిర్మిస్తున్న వ‌కీల్ సాబ్ చిత్రం దాదాపుగా పూర్త‌యింది. అతి కొద్ది షూటింగ్ మాత్ర‌మే మిగిలి ఉంది. ప్ర‌భుత్వం పూర్తి స్థాయిలో సినిమాల‌కు ప‌ర్మిష‌న్స్ ఇవ్వ‌గానే ఇది కూడా కంప్లీట్ అవుతుంది. ఆ త‌ర్వాత క్రిష్ ద‌ర్శ‌కత్వంలో ప‌వ‌న్ సినిమా చేయ‌బోతున్నారు. ఇందుకోస‌మే ప‌వ‌న్ కల్యాణ్  త‌న స్టైల్ మార్చేశార‌ని టాక్ న‌డుస్తోంది. అంతేకాకుండా ప్రాప‌ర్ డైటింగ్ కూడా చేస్తున్నారని తెలుస్తోంది. మ‌రి క్రిష్ డైరెక్ష‌న్‌లో ప‌వ‌న్ సినిమా ఉంటే ఏ విధంగా క‌నిపించ‌బోతున్నారో మ‌రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here