అవాక్క‌యిన హ‌ర్బ‌జ‌న్ సింగ్‌..బిల్లు రూ. 33,900

క‌రెంటు బిల్లులు ఎక్కువ రావ‌డం ఈ మ‌ధ్య అల‌వాటైపోయింది. స‌మ‌స్య ఏంటో కానీ సామాన్యుల వ‌ద్ద నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు అంద‌రూ దీనికి బాదితులైపోతున్నారు. తాజాగా క్రికెట‌ర్ హ‌ర్బ‌జ‌న్ సింగ్ క‌రెంటు బిల్‌పై కంప్లైంట్ ఇచ్చారు.

ముంబైలో నివాసం ఉండే హ‌ర్బ‌జ‌న్ సింగ్ త‌న క‌రెంటు బిల్ ఎక్కువ వ‌చ్చింద‌ని తెలిపారు. సాదార‌ణంగా వ‌చ్చే దానిక‌న్నా ఏడింత‌లు ఎక్కువగా బిల్ వేశార‌ని అన్నారు. రూ. 33,900 బాకీ ఉన్న‌ట్లు త‌న‌కు మెసేజ్ రావ‌డంపై బ‌జ్జీ స్పందించారు.

ముంబైలోని ఆదాని ఎల‌క్ట్రిసీటీ సంస్థను బ‌జ్జీ నిల‌దీశారు. త‌న ఇంటి ప‌క్క‌ల ఉండే వారంద‌రిదీ క‌లిపి త‌న‌కే బిల్ వేశారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. అయితే ఇలా క‌రెంట్ బిల్లులు ఎక్కువ రావ‌డం ఇదేమీ మొద‌టిసారి కాదు. ఇప్ప‌టికీ చాలా మందికి ఏదో ఒక నెల‌లో క‌రెంట్ బిల్లు ఎక్కువ రావడం మ‌నం చూస్తూనే ఉన్నాం. కాగా ఇటీవ‌ల హీరోయిన్ తాప్సీ కూడా త‌న‌కు రూ. 36 వేలు వ‌చ్చింద‌ని చెప్పింది. మొత్తం మీద ఈ క‌రెంట్ బిల్‌ సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు అంద‌రినీ ఇబ్బందులు పెడుతూనే ఉంది.

బీసీసీఐ గుట్టు విప్పిన యువ‌రాజ్‌సింగ్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here