బిగ్ బి ఇంట్లో గుడ్ న్యూస్..

హీరోయిన్ ఐశ్వర్యారాయ్ కరోనా నుండి కొలుకున్నారు. ఈమేరకు ఆమె భర్త, నటుడు అభిషేక్ బచ్చన్ వివరాలు వెల్లడించారు.కరోనా పాజిటివ్ రావడంతో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబం మొత్తం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

వారం రోజులుగా ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐశ్వర్యారాయ్, ఆమె కూతురు ఆరాధ్య నేడు కరోనా నుండి కోలుకున్నట్లు అభిషేక్ బచ్చన్ తెలిపారు. తాజాగా వీరికి చేసిన టెస్టుల్లో కరోనా నెగెటివ్ వచ్చినట్లు చెప్పారు.

దీంతో ఐశ్వర్యారాయ్, ఆరాధ్యలు ఆస్పత్రి నుండి ఇంటికి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా అభిషేక్ తాము బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మీ రుణం తీర్చుకోలేనిదన్నారు. ఇక ఇప్పటికి అమితాబ్, అభిషేక్ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఐశ్వర్యారాయ్, ఆరాధ్య వీరి తర్వాత హాస్పిటల్ లో చేరి.. వీరి కంటే ముందుగానే డిశ్చార్జ్ అయ్యారు.

చ‌లికి వ‌ణికిపోయిన అమితాబ్ బ‌చ్చ‌న్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here