బీసీసీఐ గుట్టు విప్పిన యువ‌రాజ్‌సింగ్‌

బీసీసీఐ తీరుపై టీం ఇండియా మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ ఆవేధ‌న వ్యక్తం చేశారు. ఇప్ప‌టికైనా బీసీసీఐ కొంచెం మారితే బాగుంటుంద‌ని ఆయ‌న తెలిపారు. రిటైర్మెంట్ల విష‌యంపై యూవీ పై విధంగా మాట్లాడారు.

క్రికెట‌ర్లు రిటైర్మెంట్ అయ్యే స‌మ‌యంలో బీసీసీఐ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు స‌రిగ్గా లేద‌ని య‌వ‌రాజ్ సింగ్ త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. తాను రిటైర్ అయిన‌ప్పుడు కూడా బీసీసీఐ ప్ర‌వ‌ర్త‌న అసంతృప్తిని క‌లిగించింద‌న్నారు. ఇన్ని రోజులు భార‌త్‌కు ఆడిన ఆట‌గాళ్లు ఏదో ఒక రోజు రిటైర్ అవుతున్న‌ట్లు ప్ర‌క‌టిస్తార‌ని అలాంటి స‌మ‌యంలో బీసీసీఐ క్రికెట‌ర్ల‌ను గౌర‌వించాల‌న్నారు.

క్రికెట్‌లో తానేమీ లెజెండ్ కాద‌న్నారు యూవీ. అయితే ఆడిన స‌మ‌యంలో మాత్రం ప్రాణం పెట్టి ఆడేవాడిన‌న్నారు. సెహ్వాగ్‌, హ‌ర్బ‌జ‌న్ సింగ్‌, జ‌హీర్ ఖాన్ లాంటి ఆటగాళ్లు రిటైర్ అయిన స‌మయంలో కూడా బీసీసీఐ వ్య‌వ‌హర‌శైలి దారుణంగా ఉంద‌న్నారు. ఈ విష‌యంలో బీసీసీఐ మార్పు చెందాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు.  ఇక ముందు రిటైర్ అయ్యే ఆట‌గాళ్లకైనా బీసీసీఐ త‌గిన గౌర‌వం ఇవ్వాల‌ని యూవీ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here