చంద్ర‌బాబు రాష్ట్రాన్ని భ్ర‌ష్టుప‌ట్టించారు మంత్రి ఆళ్ల నాని

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు‌పై మంత్రి ఆళ్ల‌నాని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. రాష్ట్ర ప్రభుత్వం క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల్లో దేశంలోనే మంచి పేరు సంపాదించుకుంటే చంద్ర‌బాబు అన‌వ‌స‌ర మాట‌ల‌తో ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నార‌న్నారు.

సీఎం జ‌గ‌న్ రాష్ట్రంలో స‌మ‌ర్థ‌వంత‌మైన పాల‌న అందిస్తుంటే చంద్ర‌బాబు దీన్ని ఓర్వ‌లేక‌పోతున్నార‌న్నారు. క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు సరైంది కాద‌ని మంత్రి అన్నారు. ప్ర‌జ‌లంతా చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌ను గ‌మ‌నిస్తూనే ఉన్నార‌న్నారు. ఐదేళ్ల త‌న అధికారంలో చంద్ర‌బాబు రాష్ట్రాన్ని భ్ర‌ష్టుప‌ట్టించార‌న్నారు.

ఇక డాక్ట‌ర్ల‌తో కాన్ఫ‌రెన్స్ న‌డిపిన చంద్ర‌బాబు… తాను అధికారంలో ఉన్న‌ప్పుడు 5వేల డాక్ట‌ర్లకు సంబంధించిన‌ పోస్టులు ఖాలీలు ఉంటే ఒక్క పోస్టునైనా భ‌ర్తీచేశారా అన్నారు. ఒక్క హాస్పిట‌ల్‌ను కూడా ఆయ‌న అభివృద్ధి చేయ‌లేద‌ని ద్వ‌జ‌మెత్తారు. అప్పుడు చంద్ర‌బాబు ఏమైనా అభివృద్ధి చేసి ఉంటే ఇప్పుడు కొంత‌మేర‌కైనా ఉప‌యోగం ఉండేద‌న్నారు. 108, 104 వ్య‌వ‌స్థ‌ల‌ను బాబు నిర్వీర్యం చేశార‌న్నారు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయిఉంటే రాష్ట్రం భ‌యాన‌క‌మైన పరిస్థితి ఎదుర్కొనేద‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here