యోగా స్టైల్లో స‌మంత‌.. పండ‌గ చేసుకుంటున్న అభిమానులు

సోష‌ల్ మీడియాలో ఇప్పుడు హీరోయిన్ స‌మంత హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. తాజాగా ఆమె ఓఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. స‌మంత ఫోటో పెట్టేదే లేట‌న్న‌ట్టుగా ల‌క్ష్లల్లో అభిమానులు లైక్‌లు కొట్టేస్తున్నారు.

ప్ర‌ముఖ డిజైన‌ర్‌, మోడ‌ల్ శిల్పారెడ్డి యోగా, ధ్యానం విజ‌య‌వంతంగా జీవితంలో అన్వ‌యించుకున్న‌వారిని ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్టుకు స్పందించిన స‌మంత త‌న హాట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. మామూలుగా స‌మంత యోగా, ధ్యానం ఎక్కువగా చేస్తూ ఉంటుంది. ఇక లాక్‌డౌన్‌లో వీటిపై మ‌రింత దృష్టి పెట్టింది.

త‌న లేటెస్ట్ ఫోటోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ ఉంటుంది స‌మంత‌. తాజాగా ఈ హాట్ ఫోటో అప్‌లోడ్ చేయ‌డంతో ఆమె ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. సమంత పోస్టు పెట్టిన రెండుగంట‌ల్లోనే 7ల‌క్ష‌ల‌కు పైగా లైక్‌లు ఈ ఫోటోకు వ‌చ్చాయి. డిఫ‌రెంట్ సైడ్స్‌, డిఫ‌రెంట్ షేడ్స్‌, డిఫ‌రెంట్ ఎమోష‌న్స్‌, డిఫ‌రెంట్ ఫీలింగ్స్ అన్నీ ఒకేదాంట్లోనే అని స‌మంత కామెంట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here