ఇండియాలో ప‌బ్జీ, లూడో నిషేధం..?

ఇండియాలో చైనా యాప్‌ల నిషేధం కొన‌సాగ‌తూనే ఉంది. ఇప్ప‌టికే ప‌లు యాప్‌లు నిషేధించిన విష‌యం తెలిసిందే.. కాగా ఇదే జాబితాలో మరిన్ని యాప్‌లు చేర‌నున్నాయి.

భార‌త్ చైనా మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డినప్ప‌టి నుంచి ఇంటెలిజెన్స్ అధికారుల సూచ‌న‌ల మేర‌కు చైనా యాప్‌ల‌ను మ‌న‌దేశం బ్యాన్ చే‌స్తూనే ఉంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే 59 చైనా యాప్‌లు నిషేధించ‌బ‌డ్డాయి. అయితే తాజాగా జాతీయ భ‌ద్ర‌త‌కు ముప్పు క‌లిగించేలా 275 యాప్‌లు ఉన్న‌ట్లు అధికార వ‌ర్గాలు గుర్తించిన‌ట్లు తెలుస్తోంది.

ఈ మేర‌కు ఈ యాప్‌ల‌ను కూడా నిషేధించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు విశ్వ‌స‌నీయ వర్గాల స‌మాచారం. ఈ 275 చైనా యాప్‌ల వ‌ల్ల దేశ భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్లే ప్ర‌మాదం ఉండ‌టంతో క‌చ్చితంగా వీటిని నిషేధిస్తార‌ని.. అయితే అతి త్వ‌ర‌లోనే ఇది జ‌రుగ‌న్న‌ట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో ప‌బ్జీ, లూడో కూడా ఉన్న‌ట్లు అధికార వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. టిక్‌టాక్ త‌ర్వాత మ‌న‌దేశంలో ప‌బ్జీని కూడా అదేస్థాయిలో వాడుతున్నారు. మ‌రి ఈ యాప్‌ల నిషేధంపై ప్ర‌భుత్వం ఎప్పుడు నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here