బిగ్ బాస్4పై శ్రద్ధాదాస్ కామెంట్స్

బిగ్ బాస్4లో పాల్గొనేందుకు తనను ఎవ్వరూ సంప్రదించలేదని నటి శ్రద్ధాదాస్ అన్నారు. రియాలిటీ షో  బిగ్ బాస్4 త్వరలో ప్రారంభం అవ్వనుండడం తెలిసిందే. దీనిపై ఈమె కామెంట్ చేశారు.

ఇప్పటికే బిగ్ బాస్ 4 కి సంబంధించిన పనులన్నీ నిర్వాహకులు పూర్తి చేస్తున్నట్లు సమాచారం. కంటెస్టెంట్లు కూడా సిద్ధమయ్యారని.. వీరిలో భాగంగానే శ్రద్దా పేరు కూడా వినిపించింది. దీనిపై చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు. అయితే నన్నెవరూ సంప్రదించలేదని శ్రద్దా తెలిపారు. నిజా నిజాలు తెలుసుకొని తన పేరు రాయాలని.. లేదంటే లీగల్ గా ముందుకు వెలుస్తానని వార్నిగ్ కూడా ఇచ్చేసింది శ్రద్ధాదాస్.

కరోనాను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే బిగ్ బాస్ 4 సెట్ ను అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు. ఇందులో పాల్గొనే వారికి అన్ని రకాల టెస్టులు చేసి 15 రోజులు ముందుగానే క్వారంటైన్ కు తరలించాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బుల్లితెరపై మంచి క్రేజ్ ఉన్న బిగ్ బాస్ షో.. నాల్గవ సీజన్ లో ఎలా ఉంటుందో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here