ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి హీరో జోకులు

కాశ్మీర్ ఉగ్రవాదం నేపధ్యం లో చాలా సంవత్సరాల తరవాత మాట్లాడిన సల్మాన్ ఖాన్ పాకిస్తాన్ – ఇండియా మధ్యన సంబంధాల గురించి చెప్పుకొచ్చాడు. ” పాకిస్తాన్ తోనే కాదు ఏ దేశం తో యుద్ధమూ మంచిది కాదు. అసలు యుద్ధమే మంచిది అని నేను ఎప్పుడూ అనుకోను. యుద్ధం చావుని కోరుతుంది. పాకిస్తాన్ తో చర్చలు జరిపి పరిస్థితి చక్క దిద్దుకోవాలి అనేది నా ఉద్దేశం. యుద్ధం చేయాలంటూ సూచించే వారిని పాక్ సరిహద్దులకు పంపించాలి, ముందు వారితో యుద్ధం చేయించాలి అప్పుడు వారి చేతులు, కాళ్లు వణుకుతాయి.” అన్నాడు సల్మాన్.

తన కొత్త సినిమా ట్యూబ్ లైట్ ప్రచార కార్యక్రమం లో భాగంగా మాట్లాడిన సల్మాన్ ఖాన్ మీడియా సమావేశం లో అడిగిన ప్రశ్నకి ఇలా సమాధానం చెప్పాడు. యుద్ధం జరిగితే సరిహద్దులకు ఇరువైపులా ఎంతో మంది చనిపోతారని తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here