" డీజే సినిమా విడుదల అవ్వకుండా చేస్తాం .. మా పవర్ చూపిస్తాం "

స్టైలిష్ స్టార్ అల్లూ అర్జున్ హీరోగా , హరీష్ శంకర్ డైరెక్షన్ లో రాబోతున్న డీజే సినిమా విడుదల చుట్టూ వివాదాలు మూసుకుని ఉన్నాయి. ఈ సినిమాలో గుడిలో బడిలో పాట మీద బ్రాహ్మణ సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. లిరిక్స్ అభ్యంతర కరంగా ఉండడం తో ఆ పదాలు తొలగిస్తాం అని ఎప్పుడో చెప్పారు హరీష్ శంకర్. ఆడియో ఫంక్షన్ లో కూడా అదే మాట చెప్పినా , ఆడియో తరవాత రోజు ఆ మాట చెప్పినా పదాలు మాత్రం ఆడియో సీడీ లలో అలాగే ఉన్నాయి.
దీంతో ఒళ్ళు మండిన బ్రాహ్మణ సంఘాలు ఈ సారి మానవ హక్కుల సంఘానికి ఈ సినిమా నిర్మాత, డైరెక్టర్ , హీరో , రచయిత ల మీద కంప్లయింట్ లలు ఇచ్చారు. సినిమాలోని ఆ పాట‌లో అభ్యంత‌ర‌క‌ర ప‌దాల‌తో పాటు అభ్యంత‌ర‌క‌ర సీన్లు కూడా ఉన్నాయ‌ని బ్రాహ్మణ సంఘాల స‌భ్యులు హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. ” ఈ సినిమా లో అభ్యంతరకర సీన్ లూ , పదాలూ తీసేస్తాం అని మాట కూడా ఇచ్చారు కానీ మళ్ళీ మళ్ళీ మాట తప్పుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సినిమా విడుదల అవ్వకుండా చేస్తాం ” అంటూ వార్నింగ్ లు కూడా వినపడుతున్నాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here