జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ కి పోటీగా రానా కొత్త గేమ్ షో .. భలే షాక్ ఇచ్చాడు :

ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలి లో తెలుగు బిగ్ బాస్ షో కోసం సిద్దం అవుతున్నాడు . భారీ రెమ్యునరేషన్ , భారీ బడ్జెట్ నడుమ ఈ ప్రోగ్రాం తెలుగు లో రాబోతోంది. సల్మాన్ ఖాన్ హిందీ లో అదరగొట్టిన ఈ ప్రోగ్రాం తెలుగు లో ఎంతవరకూ విజయవంతం అవుతుందో తెలీదు మరి. మరొక పక్క ఎన్టీఆర్ కి పోటీగా అన్నట్టు దగ్గుబాటి రానా కూడా కొత్త టీవీ ప్రోగ్రాం తో సిద్దమయ్యాడు. ఎన్టీఆర్ మా టీవీ లో రాబోతుంటే రానా జెమినీ టీవీ లో రానున్నాడు. ఈ ప్రోగ్రాం షూట్ అప్పుడే మొదలు కూడా అయిపొయింది. తాజాగా ఆ టీవీ ప్రోగ్రాం  టీజ‌ర్‌ను కూడా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

ఈ ప్రోగ్రాం కాన్సెప్ట్ ఏంటో తెలియాల్సి ఉంది. నెంబర్ 1 యారీ విత్ రానా అంటూ సాగుతున్న ఈ ప్రోమో ఆసక్తికరంగా ఉంది. రానా సెలెబ్రిటీ లతో ఇంటర్వ్యూ లు చేస్తాడా లేక ఇంకేదైనా స్పెషల్ రియాలిటీ షో చేస్తాడా అనేది చెప్పలేక పోతున్నారు ఎవ్వరూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here