వెన్నెల కిషోర్ ని పోగిడేస్తున్న ప్రేక్షకులు .. అడవి శేష్ , శ్రీనివాస్ ల ఫీలింగ్ ఏంటి ?

తాజాగా విడుదల అయిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమా అమీ తుమీ డీసెంట్ ఎంటర్టైనర్ గా హిట్ తో దూసుకు పోతోంది. ఈ సినిమా లో అడవి శేష్ , శ్రీనివాస్ అవసరాల లు హీరోలుగా చేసారు. కానీ ఈ చిత్రం చూసినవాళ్ళు ఎవ్వరైనా సరే వెన్నెల కిషోర్ ఈ సినిమాకి హీరో అని అంటున్నారు. వెన్నెల కిషోర్ పాత్ర హీరోల పాత్ర కంటే ఎక్కువ సేపు ఉండడం విశేషం. కిషోర్ ని పక్కకి పెట్టి ఈ సినిమా తలచుకుంటే అసలేమీ ఉండదు. కిషోర్ లేని సీన్ లు పరమ బోరింగ్ అంటే అతిశయోక్తి కాదు.

వెన్నెల కిషోర్ సినిమాలో ఎంట్రీ ఇవ్వడం కాస్త లేటుగా ఇస్తాడు కానీ అతను వచ్చిన దగ్గర నుంచీ ఫుల్ టూ ఫన్ తో సాగుతుంది స్టోరీ. సినిమా విడుదల తరవాత ప్రమోషన్ల వియంలోనూ వెన్నెల కిషోర్‌కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు నిర్మాతలు. ఈ దెబ్బతో శేష్ , శ్రీనివాస్ లు కాస్తంత చిన్న బుచ్చుకున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా నుంచి అన్ని చోట్లా వెన్నెల కిషోర్ నే హీరోగా హై లైట్ చేస్తూ ఉంటె తమ పరిస్థితి ఏంటి అని వాపోతున్నారట వారిద్దరూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here