నందమూరి ఫాన్స్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్న పూరీ జగన్నాథ్

తెలుగు ఇండస్ట్రీ లో ఒక సినిమా షూటింగ్ మొదలు పెట్టి , అది ఎంత పెద్ద హీరోతో అయినా సరే త్వరిత గతిన షూటింగ్ పూర్తి చెయ్యగల డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. స్పీడ్ డైరెక్టర్ అనే టాగ్ ఇప్పటికే ఉన్న పూరీ మూడు నెలల్లో చుట్టి అవతల పడేయడం లో స్పెషలిస్ట్. అయితే ఆ స్పీడ్ ఇప్పుడు పనికి రావడం లేదు . పూరీ ట్రాక్ రికార్డ్ చాలా పేలవంగా ఉండడమే దీనికి కారణం. స్పీడ్ విషయం లో తొందర పడుతున్న పూరీ జగన్నాథ్ గత కొన్నేళ్లుగా స్పీడ్ కంగారు లో పడి కాన్సెప్ట్ , కంటెంట్ , కథ ఇవన్నీ గాలికి వదిలేస్తున్నాడు అనే అపవాదులు ఉన్నాయి.

తాజాగా బాలకృష్ణ తో పైసా వసూల్ సినిమా చేస్తున్న పూరీ ఈ సినిమా విషయంలోనూ ఎంతసేపూ స్పీడు గురించే మాట్లాడుతుండటం నందమూరి అభిమానుల్ని ఒకింత కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లి రెండు నెలలు దాటిందంతే. అప్పుడే ఎనభై శాతం పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అనుకున్న షెడ్యూల్ కంటే పోర్చుగల్ లో నాలుగు రోజుల ముందే షూటింగ్ అయిపొయింది. ఈ న్యూస్ నందమూరి ఫాన్స్ ని కలవర పెడుతోంది. అసలే ప్లాపులలో ఉన్న పూరీ బాలయ్య ఫాన్స్ కి ఎలాంటి షాక్ ఇస్తాడో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here