ప్రభాస్ పక్కన అనుష్క అందంగా ఉండదేమో అంటున్నారు .

ప్రభాస్ కొత్త సినిమా సాహో కి సంబంధించి హీరోయిన్ గా ఎవరు ఉంటారు అనేదాని మీద అనేక పేర్లు వినపడుతూ ఉన్నాయి. అందరినీ కాదు అని ప్రభాస్ లక్కీ హీరోయిన్ అయిన అనుష్క ని డైరెక్టర్ సుజీత్ ఫైనల్ చేసాడు అని సుజీత్ సోర్సెస్ నుంచి వినిపిస్తున్న టాక్. బిల్లా, మిర్చి , బాహుబలి లాంటి సినిమాలలో ప్రభాస్ – అనుష్క ల పైర్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ చేసింది. అయితే సాహో సినిమాకి అనుష్క సెట్ అవుతుందా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆమె ఒకప్పటి లాగా సెక్సీ లుక్ తో కనపడ్డం లేదు.

బిల్లా , మిర్చీ టైం లో ఉన్న అనుష్క కాదు ఆమె. సైజు జీరో సినిమా కోసం తిప్పలు పడి ఫుల్లుగా ఒళ్ళు పెంచి ఎలా తగ్గాలో తెలీక గింగిరీలు కొడుతోంది. పైగా వయసు ప్రభావం కూడా అనుష్క మీద గట్టిగా ఉంది. ఈ నేపథ్యంలో ‘సాహో’ లాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌కు అనుష్క ఏమాత్రం సూటవుతుందో అన్న సందేహాలు నెలకొంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here