తాప్సీ తో చ‌నువుగా నిర్మాత‌..కొట్టిపారేసిన సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి

అదృష్టం ద‌రిద్రం ప‌ట్టిన‌ట్లు ప‌డితే అడ్ర‌స్ కూడా గ‌ల్లంత‌వుతుందట‌. ఇది తాప్సీకి అచ్చుగుద్దిన‌ట్లు స‌రిపోతుంది. తెలుగులో పెద్ద పెద్ద హీరోల‌తో డ‌జ‌నుకొద్ది సినిమాల్లో యాక్ట్ చేసింది. పాపం కాలం క‌లిసిరాక ఆ సినిమాలు కూడా స‌రైన హిట్ ల‌భించ‌లేదు. తెలుగులో లాభంలేద‌నుకొని బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రీ ఓ ప్రొడ్యూస‌ర్ తో ఎఫైర్ న‌డుపుతుంద‌నే వార్త‌లు బాలీవుడ్ నెట్టింట్లో చ‌క్కెర్లు కొడుతుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన ఈ అమ్మ‌డు అక్క‌డ కొన్ని సినిమాల్లో న‌టించిన అంత‌పేరు సంపాదించుకోలేక‌పోయింది. అయితే పింక్ సినిమా మాత్రం తాప్సీ కు ట‌ర్నింగ్ పాయింట్ అయింద‌నే చెప్పుకోవాలి. ఆ సినిమాలో లెజెండ్ అమితాబ్ తో కలిసి నటించి అందరి ప్రశంసలు పొందింది.

దీంతో ద‌శ‌మారింద‌నుకున్న తాప్సికీ జూడ‌వా2 రూపంలో మ‌రోసారి  అదృష్టం వ‌రించింది. శ్రీలంక భామ జాకెవెల‌న్ ఫెర్నాండేజ్ , తాప్సిలు సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్న ”జూడవా 2” లో నటిస్తోంది. చిత్రం షూటింగ్ స‌మాయాల్లో సాజిద్ తో బాగా క్లోజ్ గా ఉంటుంద‌ని టాక్. అంతేకాదు పెర్నాండేజ్ తో  కంటే సాజిద్ తాప్సీతో చ‌నువుగా ఉంటున్నాడ‌ట‌. దీనిపై రూమ‌ర్స్ రావ‌డంతో తాప్సి స్పందించింది. సాజిద్ తో ఎటువంటి సంబంధంలేద‌ని, ఓ సినిమా నిర్మాత‌గా సాజిద్ తెలుసు అని అంత‌కంటే మా ఇద్ద‌రి మ‌ధ్య ఏం లేద‌ని కొట్టిపారేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here