క‌రోనా టీకా రెడీ..

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ టీకా వ‌చ్చేసింది. రష్యా తొలి వ్యాక్సిన్‌ను నేడు విడుద‌ల చేసింది. స్వ‌యంగా ఆ దేశ అద్య‌క్షుడు పుతిన్ ప్ర‌క‌ట‌న చేశారు. తొలి విడ‌త‌గా ఎవ‌రెవ‌రికి ఇస్తార‌న్న దానిపై ఆందోళ‌న నెల‌కొంది.

ఊహించ‌న‌ట్లుగానే ర‌ష్యా అంద‌రి క‌న్నా ముందే క‌రోనా టీకా క‌నిపెట్టేసింది. టీకాను క‌నుగొనేందుకు ప్ర‌పంచ దేశాలు ఆస‌క్తిక‌న‌బ‌రుస్తున్న తరుణంలో ర‌ష్యా ఈమేర‌కు విజ‌యం సాధించింది. మొద‌ట‌గా త‌న కుమార్తె ఈ టీకా వేయించుకున్న‌ట్లు పుతిన్ వెల్ల‌డించారు. ప్ర‌పంచంలో క‌రోనా వ్యాక్సిన్‌ను రిజిస్ట‌ర్ చేసిన తొలి దేశంలో ర‌ష్యా అవ‌త‌రించింద‌న్నారు.

ఈ టీకాను మొద‌ట‌గా ఎవ‌రికిస్తార‌న్న దానిపై పుతిన్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు టీకా ఇవ్వ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. కాగా ఈయ‌న టీకాపై కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. టీకాపై ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు సమాచారం అందించాల‌ని దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్‌ను ఆయ‌న ఆదేశించారు. కాగా ఈ ఏడాది చివరి కంతా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామ‌ని ట్రంప్ ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here