మూడు మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల్లో మెగాస్టార్‌..

సినిమా షూటింగులు ప్రారంభం అవ్వ‌గానే హీరోలు బిజీ అయిపోనున్నారు. ఇప్ప‌టికే ప‌లు సినిమా షూటింగులు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ కోవ‌లోకే మెగాస్టార్ చిరంజీవి వ‌చ్చేస్తున్నారు. షూటింగ్ ప్రారంభమైతేనే మూడు సినిమాలు ఆయ‌న కోసం సిద్ధంగా ఉన్నాయి.

మెగాస్టార్ ఆచార్య సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో రామ్ చ‌ర‌ణ్ కూడా న‌టిస్తున్నారు. ఇది కాకుండా మ‌ల‌యాళంలో మంచి హిట్ సాధించిన లూసిఫ‌ర్ సినిమాను కూడా చిరు చేయ‌నున్నారు. త‌న తండ్రి కోసం ప్ర‌త్యేకంగా రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమా హ‌క్కులు కొనేశారు. ఇది కూడా మ‌ల్టీస్టార‌ర్ చిత్ర‌మే.

ఇది కాకుండా ద‌ర్శ‌కుడు బాబీ కూడా చిరు కోసం ఓ మ‌ల్టీస్టార‌ర్ క‌థ సిద్ధం చేస్తున్నారు. చిరంజీవి కూడా ఈ సినిమాను ఓకే చేశారు. ఆచార్య త‌ర్వాత మెగాస్టార్ ఈ సినిమానే చేయ‌నున్నారు. అయితే ఈ సినిమాల్లో చిరుతో పాటు మ‌రో హీరో ఎవ‌రుంటార‌నేది ఆస‌క్తిగా మారింది. మెగా ఫ్యామిలీలోనే ఎంతో మంది హీరోలున్నారు. అయితే వీరిలో నుంచి ఒక‌రిని ఎంపిక చేసుకుంటారా.. లేదా బ‌య‌ట హీరోలు ఎవ‌రైనా చిరుతో క‌లిసి న‌టిస్తారా అన్న‌ది తెలియాల్సి ఉంది. మొత్తానికి క‌రోనా అనంత‌రం మెగాస్టార్ ఒక‌టి త‌ర్వాత ఒక‌టి మూడు సినిమాల‌తో బిజీగా ఉండ‌నున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here