మార్కెట్లోకి ర‌ష్యా వ్యాక్సిన్‌.. భార‌త్‌తో సంప్ర‌దింపులు

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్‌ను త‌యారుచేసి రష్యా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్‌ను ర‌ష్యా మార్కెట్లోకి విడుద‌ల చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. దేశ వ్యాప్తంగా త్వ‌ర‌లోనే ఈ వ్యాక్సిన్ పంపిణీ చేప‌డ‌తామ‌ని పేర్కొంది.

ర‌ష్యా క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో విజ‌య‌వంత‌మైన వ్యాక్సిన్‌ను స్పుత్నిక్ వి గా పేరు పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ను ఆ దేశ అధ్య‌క్షుడు పుతిన్ ఆయ‌న కుమార్తెకు అందించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి విడుద‌ల చేసిన‌ట్లు ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. అన్ని ర‌కాల ప్ర‌యోగ‌శాల‌ల్లో వ్యాక్సిన్ విజ‌య‌వంతం అవ్వ‌డంతోనే దీన్ని రిలీజ్ చేశామ‌ని తెలిపింది.

ఇప్ప‌టికి ర‌ష్యా వ్యాక్సిన్‌కు రెండు ద‌శల ట్ర‌య‌ల్స్ పూర్త‌య్యాయి. ఇక మూడో ద‌శట్ర‌య‌ల్స్ కోసం భార‌త్‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇస్తే త్వ‌ర‌లోనే ఇండియాలో ర‌ష్యా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ ప్రారంభం అయ్యే అవ‌కాశం ఉంది. ఇదే జ‌రిగితే వ్యాక్సిన్ కూడా దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వ‌స్తుంది. మ‌న దేశంలో త‌యారుచేస్తున్న వ్యాక్సిన్‌కు ర‌ష్యా వ్యాక్సిన్‌కు చాలా గ్యాప్ ఉన్న ప‌రిస్థితుల్లో రష్యా వ్యాక్సిన్ విజ‌య‌వంతంగా మూడో ద‌శ పూర్తి చేసుకోవ‌డం ప్ర‌పంచానికి శుభ‌ప‌రిణామంగా మారే అవ‌కాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here