హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ మాట‌లు వింటే ఇక అంతే.

కాలాన్ని బ‌ట్టి మ‌నం ముందుకెళ్లాలి, ఎలాంటి ఇబ్బందులు వ‌చ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి అంటూ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ అంద‌రిలో ఆత్మ‌స్థైర్యాన్ని నింపే ప‌నిలో ఉంది. క‌ష్ట‌మైనా 2020లో ఇష్టంగా ముందుకెళ్లాల‌ని చెబుతోంది.

2020లో సగం పూర్తయిన సంద‌ర్భంలో ర‌కుల్ త‌న స్పంద‌న తెలియ‌జేసింది. ఇప్పుడున్న విప‌త్క‌ర ప‌రిస్థితులు మ‌న చేతిలో ఏమీ లేవ‌ని.. అందుకే సాధ్య‌మైనంత వ‌ర‌కు సానుకూలంగా సాగిపోదామని చెప్పింది. స‌రిహ‌ద్దుల్లో సైనికులు ప్ర‌తి రోజూ ఊహ‌కంద‌ని విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనే కాలం గ‌డుపుతున్నారు. మ‌నం ఇప్పుడొచ్చిన ఈ క‌రోనా సమ‌స్య‌ నుంచి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తామో తెలియ‌ద‌ని చెబుతోంది.. అందుకే ధైర్యంగా ఉండాలంటోంది.

అప్ప‌ట్లో మన పెద్ద వారు పెద్ద పెద్ద మ‌హ‌మ్మారుల్ని ఎదుర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు మ‌న‌మింకా మంచి ప‌రిస్థితుల్లోనే ఉన్నట్లు గుర్తు చేసింది. ఏదిఏమైనా మ‌న‌మంతా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, రోజుకో కొత్త జీవితాన్ని చూపిస్తున్న దేవుడికి థ్యాంక్స్ అని తెలిపింది. క‌రోనా విజృంభిస్తున్న భ‌యంక‌ర‌మైన ప‌రిస్థితుల్లో మ‌న‌లోమ‌న‌కు ఆత్మ‌స్థైర్యం చాలా అవ‌స‌రం. ఎప్పుడూ పాజిటివ్ మూడ్‌లోనే ఉంటే ఎలాంటి ఇబ్బందులు వ‌చ్చినా ఇట్టే ఎదుర్కోగ‌ల శ‌క్తి మ‌న‌కు ఉంది. అయితే కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ ప‌డిపోతున్న వారికి ర‌కుల్ మాట‌లు బాగా ఉప‌యోగ‌డ‌ప‌తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here